ఎడిటోరియల్

Monday, July 26, 2021

జగ్గంపేట నియోజకవర్గంలో సర్వే చేసిన గిరిజనుల భూములకు పట్టాలు ఇవ్వాలి.

ఈరోజు అనగా ది.26 జులై 2021న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం మరియు జిల్లా ఫారెస్ట్ అధికారి కార్యాలయం ఎదుట జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న జగ్గంపేట మండలం గోవిందపురం, భావవరం, గంగవరం మండలం మల్లవరం కలిజోడుపేట, గండేపల్లి మండలం కె. గోపాలపురం గ్రామాల కొండదొర కులానికి చెందిన గిరిజనులు గత 50 సంవత్సరాలకు పైగా సాగుచేస్తున్న, ప్రభుత్వ అధికారులు సర్వే చేసిన భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం, అఖిల భారత వ్యవసాయ-గ్రామీణ కార్మిక సంఘం (అయార్ల) సి.పి.ఐ (యమ్.యల్) లిబరేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నా అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ వారికి, జిల్లా ఫారెస్ట్ అధికారి వారికి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నానుద్దేశించి మాట్లాడిన అయార్ల రాష్ట్ర కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, సి.పి.ఐ (యమ్.యల్) లిబరేషన్ రాష్ట్ర నాయకులు గొడుగు సత్యనారాయణ, పి.నరసరాజు, అయార్ల జిల్లా నాయకులు అల్లి చంద్రరావు, గిరిజన సంఘం జగ్గంపూడి రాజు, పందిరి రాము, కూడ కృష్ణ, మరిణమ్మ, సింగరయ్య, దేవమ్మా, రాముడు, కుంజన్న దొర మరియు అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Tuesday, March 9, 2021

విశాఖ స్టీల్ ప్లాంట్ వందశాతం ప్రైవేటైజేషన్ చేస్తామన్న నిర్మలాసీతారామన్ చర్యలకు వ్యతిరేకంగా విశాఖలో మార్చి 23న ప్రజా పార్లమెంట్ నిర్వహిస్తాం!! ......కిసాన్ మహాసభ

 విశాఖ స్టీల్ ప్లాంట్ ను వందశాతం ప్రైవేటైజేషన్ చేస్తామన్న నిర్మలాసీతారామన్ చర్యలకు వ్యతిరేకంగా విశాఖలో మార్చి 23న "ప్రజా పార్లమెంటు" నిర్వహిస్తామని కిసాన్ సభ రాష్ట్ర కార్యదర్శి డి.హరినాధ్ తెలిపారు.

          కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ ప్రయోజనాల కోసం పబ్లిక్ రంగాన్ని కారుచౌకగా ఆదాని, అంబానీలకు పెడుతుందని విమర్శించారు. ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేసి పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ప్యాక్టరీని బిజెపి ప్రభుత్వం పోస్కో కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. యావత్ భారతదేశ రైతాంగం భగత్ సింగ్ స్ఫూర్తితో ఢిల్లీలో మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని హరినాథ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విశాఖ ఉక్కును ప్రైవేటైజేషన్ ఆపి పరిరక్షించాలని మార్చి14 వ తేదీ వరకు గ్రామాల వారీగా కిసాన్ పంచాయితీలు నిర్వహించి మోడీ తెచ్చిన చట్టాలను రద్దు చేయాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధానాలు విరమించాలని తీర్మానాలు చేయించాలని, 15వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద వందలాది మంది రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థి, యువకులతో "మాస్ అసెంబ్లీ" జరుగు తుందని జగన్మోహన్ రెడ్డి 18వ తేదీ నుండి జరిపే రాష్ట్ర అసెంబ్లీలో  తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. "ఛలో విశాఖ" కార్యక్రమంలో భాగంగా మార్చి 16 నుండి  22 వరకు పై రెండు డిమాండ్ల సాధన కోసం జిల్లాలో ప్రచారం నిర్వహించి భగత్ సింగ్ వర్ధంతి 23వ తేదీన విశాఖలో" ప్రజా పార్లమెంట్" నిర్వహించాలని "కార్మిక, కర్షక, మహిళా, విద్యార్థి, యువకుల ఐక్యతతో" స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా సిపిఐ(యమ్.యల్) లిబరేషన్ అనుబంధ సంఘాలైన అఖిలభారత వ్యవసాయ– గ్రామీణ కార్మిక సంఘం, అల్ ఇండియా కిసాన్ మహాసభ, ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్(AICCTU) సంయుక్త ఆధ్వర్యంలో విశాఖలో నిరసన ఆందోళన చేపట్టాలని  ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి హరినాథ్ తెలిపారు.