ఎడిటోరియల్

Wednesday, November 14, 2018

సి.బి.ఐ, ఆర్.బి.ఐ, సుప్రీంకోర్టు - రాజ్యాంగ సంస్థలు, పాలన యంత్రాంగంపై పెచ్చుమీరుతున్న మోడి ప్రభుత్వపు దాడి.

ఎం.ఎల్ అప్డేట్ అక్టోబర్ 30 సంపాదకీయం.
సి.బి., ఆర్.బి., సుప్రీంకోర్టు - రాజ్యాంగ సంస్థలు, పాలన యంత్రాంగంపై పెచ్చుమీరుతున్న మోడి ప్రభుత్వపు దాడి.

     2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది, పాలనా యంత్రాంగాలపై మోఢి ప్రభుత్వపు దాడి నానాటికి తీవ్రతరం చేస్తుంది. రాజ్యాంగ బద్ద సంస్థలను నిర్వీర్యం చేసి, భా..పా - ఆర్.ఎస్.ఎస్ మనువాద అజెండాకు మడుగులు వత్తే విధంగా అధికార యంత్రాంగాన్ని ప్రభావితం చేసే ప్రయత్నాలు ఇప్పటి వరకు తెరవెనుక సాగాయి. కాని ఇప్పుడు ఏకంగా బహిరంగ బెదిరింపులకు దిగుతూ, మాట వినని ఆయా సంస్థల ఉన్నతాదికారులతో డి అంటే డి అనే స్థాయికి భా..పా ప్రభుత్వం తెగబడుతుంది. తన జవాబుదారి తనానికి ప్రశ్న ఎదురయ్యే సరికి భా..పా ప్రభుత్వం ప్రశ్న లేవనెత్తే ప్రతి సంస్థ అధికారాన్ని నిర్వీర్యం చేసేందుకు బెదిరించి మెడలు వంచే పనికి పూనుకుంటుంది. వేడి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లతో పాటు సుప్రీం కోర్టుకు కూడా తగిలింది.
        గత యు.పి. ప్రభుత్వ హయాంలో సి.బి. డిపార్టిమెంటు ని "పంజరంలో బంధించబడిన చిలుక" అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం మన అందరికి గుర్తుండే ఉంటుంది. భాజపా ప్రభుత్వం వచ్చాక పంజరంలోని చిలుకను స్వేచ్చగా వదిలేసే మాట అటుంచి, పంజరాన్ని మరింత ఇరుకుగా చేసే పనులే చేస్తుంది. తగిన సమయంలో సి.బి. ని ఉసికొల్పి వివిధ రాష్ట్రాలలో పాలక-ప్రతిపక్షాలను దారిలో తెచ్చుకునేందుకు, తమతో పొత్తు కుదుర్చుకునేలా చేసేందుకే మాత్రమే సి.బి. ని ప్రయోగిస్తుంది. ప్రక్రియలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎంఫోర్స్మెంట్ డైరెక్టరెట్ లు పాలక ఎన్.డి. ప్రభుత్వ భాగస్వాములుగా తయరయ్యాయి.
           అభ్యంతరాలన్నిటిని పెడచెవిన పెడుతూ, గుజరాత్ నరమేధపు రోజుల నుంచి తనకు అత్యంత నమ్మకస్తుడిగా వ్యవహరిస్తున్న రాకేష్ ఆస్థానా ని సి.బి. ప్రత్యేక డైరెక్టరుగా మోడి నియమించుకున్నాడు. అంతేకాక, అవినీతి కేసులలో అధికారిని విచారించాలాన్నా సి.బి. లేదా మరే ఇతర దర్యాప్తు సంస్థైనా ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా పొందాలన్న నియమాన్ని చేరుస్తూ అవినీతి నిరోధక ఛట్టంలో మార్పులు తెచ్చారు. కాని రఫెల్ ఒప్పందం గురించి భయటపడ్డ విషయాలతో ఖంగుతిన్న మోడి సి.బి. విషయంలో సైతం జాగ్రత్త వహించాలన్న స్పృహలోకి వచ్చాడు. దాని ఫలితంగానే, సి.బి. మొత్తాన్ని మోడి-షా కబంధ హస్తాలలోకి తీసుకోవాలన్న స్వయంగా ప్రభుత్వం చేస్తున్న కుట్రను మనం చూస్తున్నాం.
                 మారిన అవినీతి ఛట్ట నియమం ప్రకారం, ప్రధాని స్వయంగా సభ్యుడైన కొలీజియం ద్వారా నియమితుడై 2019 జనవరి వరకు ఉధ్యోగంలో ఉండవల్సిన సి.బి. డైరెక్టర్ ఆలోక్ వర్మ స్వయంగా రాకేష్ ఆస్థానా అవినీతిపై దర్యప్తు చేపట్టడానికి అనుమతి కోరగా, ప్రభుత్వం సి.బి. డైరెక్టర్ ఆలోక్ వర్మనే తొలగించి స్థానంలో అవినీతికి మారుపేరుగా ఖ్యాతి గడించిన ఎం.నాగేశ్వరరావుని తాత్కాలిక డైరక్టర్ గా నియమించడం జరిగింది. అంతే కాక ఆలోక్ వర్మ కధలికలను కట్టడి చేసేందుకు తన అధికారిక నివాసం చుట్టూ నిఘా వర్గాలను నియమించటం జరిగింది. రాకేష్ అస్థానా తన చరిత్ర ఘనత ఏపాటిదో, గుజరాత్ లో పనిచేస్తుండగా గొధ్రా అల్లర్ల కేసులో మోడి పక్షం వహించడం ద్వారా, భారీ స్థాయిలో సొమ్ములను పోలీస్ సంక్షేమ నిధి నుండి భా..పా ఎన్నికల నిధిలోకి మరల్చడం ద్వారా నిరూపించుకున్నాడు. అలాగే నాగేశ్వరరావు కూడా ఒరిస్సా లోని ఫైర్ బ్రిగేడ్ యూనిఫార్మ్ స్కాం లాంటి అవినీతి కేసుల ద్వారా, సంఘ్ పరివార్ అరాచక చర్యలకు అనేక సార్లు తన వ్యాఖ్యానాల ద్వారా మద్ధతు తెలుపుతూ తన అర్హతను నిరూపించుకున్నాడు. ఒకపక్క ఇటువంటి నమ్మకస్తులైన తాబేదారులతో మోఢి ప్రభుత్వం సి.బి., సి.వి.సి లాంటి సంస్థలను నింపుతూ మరోపక్క కీలకమైన కేసులలో దర్యాప్తు చేపడుతున్న అధికారులపై తొలగింపులు, స్థానచలన ఉత్తర్వులు జారీ చేస్తూ వారిని వేధింపులకు గురిచేస్తుంది. సి.బి. కార్యాలయంలో కీలకమైన దస్తావేజులను మాయం చేయడానికి ఇంటెలిజన్స్ అధికారుల పేరుతో గుర్తుతెలియని వ్యక్తులను పంపే స్థాయికి తెగించింది.
             సి.బి. వ్యవహారంలో ప్రభుత్వం అనుసరించిన తీరు ఆర్ధిక, ప్రభుత్వ పాలన, న్యాయ శాఖల సహా దేశంలోని ఇతర ప్రధానమైన సంస్థలతో అది అనుసరించబోయే తీరుకు సంకేతంగా మనం అర్ధం చేసుకోవచ్చు. క్రిందటి ఆర్.బి. గవర్నర్ అయిన రఘురాం రంజన్ ను రెండవ సారి కొనసాగించేందుకు నిరాకరించటం, అత్యంత దారుణమైన-విచిత్రమైన నిర్ణయమైన మోఢి ప్రభుత్వపు నోట్ల రద్దు చర్యను సమర్దించవల్సిందిగా ఆర్.బి. ని బలవంత పెట్టడం లాంటి చర్యలతో మోఢి ప్రభుత్వం బ్యాంకింగ్ రంగ స్వయం ప్రతిపత్తికి, స్వతంత్ర నియంత్రణాధికారానికి కోత విధంచడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. కార్పొరేట్ ఎగవేతదారులపై మరింత ఖఠినమైన నియమాలను రూపొందించుకోవాలని, తన స్వంత నగదు నిల్వలను కాపాడుకోవాలని, ఆర్.బి. తో లావాదేవీలు జరిపే భాగస్వాములందరిపై నియంత్రణాధికారం తనకే ఉండాలన్న ఆర్.బి. నిర్ణయాలపై ప్రభుత్వం నుంచి, ఆర్.ఎస్.ఎస్ మద్ధతుదారులైన ఆర్ధిక నిపుణుల నుంచి అవిరామంగా దాడి తీవ్రమవుతూ వస్తుంది. తదనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ల బోర్డులో ఆర్.ఎస్.ఎస్ ఆర్ధిక నిపుణులు నియమింపబడటం కూడా జరిగింది.
                  బహుశా వీటన్నిటిని మించిన బహిరంగ ఘర్షణ ఏదో ప్రభుత్వానికి, సుప్రీం కోర్టుకి మధ్య జరగబోతున్నట్లు sకనబడుతుంది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును మొదట ఆహ్వానించి తరువాత పూర్తిగా మాటమార్చింది. అమలుచేయగల విధంగా మాత్రమే తీర్పులు వెలువరించాలని ఏకంగా సుప్రీంకోర్టుకే అమిత్ షా సలహాలివ్వడం మనం గమనించాం. అక్కడితో ఆగక, సుప్రీంకోర్టు తీర్పును అమలుచేసేందుకు ప్రయత్నించిన కేరళా ఎల్.డి.ఎఫ్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో పెకలించాలని పార్టి కేడర్ కు పిలుపునివ్వడం జరిగింది.అయోధ్య స్థలం ఎవరికి చెందుతుందన్న విషయంపై సుప్రీంకోర్టు జనవరిలో తీర్పు చెప్పనున్న నేపధ్యంలో, భా..పా మంత్రులు "హిందువుల సహనాన్ని పరీక్షించొద్దు" అంటూ బాహాటంగా బెదిరింపు-రెచ్చగొట్టే తరహా ప్రకటనలు చేస్తున్నారు. హిందుత్వ ఉన్మాద మూకలైతే సామాజిక మాధ్యమాలలో మరింత బరితెగించి కూల్చబడ్డ బాబ్రి మసీదు గోపుర స్థానంలో సుప్రీంకోర్టు గోపురపు చిత్రాలు పెట్టి స్పష్టమైన బెదిరింపు సంకేతాలు పంపుతున్నారు.
                   మోడి ప్రభుత్వం చేస్తున్న దాడులన్ని కేవలం ముస్లింలు, దళితులు, అర్బన్ నక్సల్స్ పైనే అనుకుంటే చాలా పొరపాటు చేసినట్లే. మనం ఒకసారి స్పృహలోకి వచ్చి పరిస్థితులను గమనించాలి. దాడులు కేవలం మైనార్టిలు, అణగారిన - బలహీన వర్గాలకే పరిమితం కాదు. ఇది ఏకంగా ప్రజాస్వామిక పరిపాలనా యంత్రాంగం పైనా, రాజ్యాంగ బద్ద సంస్థలపైన ఎక్కుపెట్టిన దాడి. ఏదైనా విపత్తు ఒక ప్రాంతాన్ని తాకితే, అది చుట్టుపక్కల ప్రాంతాలకి కూడా వినాశకారిగా మారుతుంది. ప్రస్తుతం మోడి ప్రభుత్వ చర్యలు సమగ్ర స్థాయిలో ఆర్ధిక-సామాజిక-రాజకీయ సంక్షోభానికి సంకేతంగా కనబడుతున్నాయి.ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొడి అనే పెను విపత్తునుంచి భారతదేశాన్ని మనమే రక్షించుకోవాలి.