ఎడిటోరియల్

Monday, July 26, 2021

జగ్గంపేట నియోజకవర్గంలో సర్వే చేసిన గిరిజనుల భూములకు పట్టాలు ఇవ్వాలి.

ఈరోజు అనగా ది.26 జులై 2021న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం మరియు జిల్లా ఫారెస్ట్ అధికారి కార్యాలయం ఎదుట జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న జగ్గంపేట మండలం గోవిందపురం, భావవరం, గంగవరం మండలం మల్లవరం కలిజోడుపేట, గండేపల్లి మండలం కె. గోపాలపురం గ్రామాల కొండదొర కులానికి చెందిన గిరిజనులు గత 50 సంవత్సరాలకు పైగా సాగుచేస్తున్న, ప్రభుత్వ అధికారులు సర్వే చేసిన భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం, అఖిల భారత వ్యవసాయ-గ్రామీణ కార్మిక సంఘం (అయార్ల) సి.పి.ఐ (యమ్.యల్) లిబరేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నా అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ వారికి, జిల్లా ఫారెస్ట్ అధికారి వారికి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నానుద్దేశించి మాట్లాడిన అయార్ల రాష్ట్ర కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, సి.పి.ఐ (యమ్.యల్) లిబరేషన్ రాష్ట్ర నాయకులు గొడుగు సత్యనారాయణ, పి.నరసరాజు, అయార్ల జిల్లా నాయకులు అల్లి చంద్రరావు, గిరిజన సంఘం జగ్గంపూడి రాజు, పందిరి రాము, కూడ కృష్ణ, మరిణమ్మ, సింగరయ్య, దేవమ్మా, రాముడు, కుంజన్న దొర మరియు అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Tuesday, March 9, 2021

విశాఖ స్టీల్ ప్లాంట్ వందశాతం ప్రైవేటైజేషన్ చేస్తామన్న నిర్మలాసీతారామన్ చర్యలకు వ్యతిరేకంగా విశాఖలో మార్చి 23న ప్రజా పార్లమెంట్ నిర్వహిస్తాం!! ......కిసాన్ మహాసభ

 విశాఖ స్టీల్ ప్లాంట్ ను వందశాతం ప్రైవేటైజేషన్ చేస్తామన్న నిర్మలాసీతారామన్ చర్యలకు వ్యతిరేకంగా విశాఖలో మార్చి 23న "ప్రజా పార్లమెంటు" నిర్వహిస్తామని కిసాన్ సభ రాష్ట్ర కార్యదర్శి డి.హరినాధ్ తెలిపారు.

          కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ ప్రయోజనాల కోసం పబ్లిక్ రంగాన్ని కారుచౌకగా ఆదాని, అంబానీలకు పెడుతుందని విమర్శించారు. ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేసి పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ప్యాక్టరీని బిజెపి ప్రభుత్వం పోస్కో కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. యావత్ భారతదేశ రైతాంగం భగత్ సింగ్ స్ఫూర్తితో ఢిల్లీలో మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని హరినాథ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విశాఖ ఉక్కును ప్రైవేటైజేషన్ ఆపి పరిరక్షించాలని మార్చి14 వ తేదీ వరకు గ్రామాల వారీగా కిసాన్ పంచాయితీలు నిర్వహించి మోడీ తెచ్చిన చట్టాలను రద్దు చేయాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధానాలు విరమించాలని తీర్మానాలు చేయించాలని, 15వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద వందలాది మంది రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థి, యువకులతో "మాస్ అసెంబ్లీ" జరుగు తుందని జగన్మోహన్ రెడ్డి 18వ తేదీ నుండి జరిపే రాష్ట్ర అసెంబ్లీలో  తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. "ఛలో విశాఖ" కార్యక్రమంలో భాగంగా మార్చి 16 నుండి  22 వరకు పై రెండు డిమాండ్ల సాధన కోసం జిల్లాలో ప్రచారం నిర్వహించి భగత్ సింగ్ వర్ధంతి 23వ తేదీన విశాఖలో" ప్రజా పార్లమెంట్" నిర్వహించాలని "కార్మిక, కర్షక, మహిళా, విద్యార్థి, యువకుల ఐక్యతతో" స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా సిపిఐ(యమ్.యల్) లిబరేషన్ అనుబంధ సంఘాలైన అఖిలభారత వ్యవసాయ– గ్రామీణ కార్మిక సంఘం, అల్ ఇండియా కిసాన్ మహాసభ, ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్(AICCTU) సంయుక్త ఆధ్వర్యంలో విశాఖలో నిరసన ఆందోళన చేపట్టాలని  ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి హరినాథ్ తెలిపారు.

Monday, February 24, 2020

ప్రతిఘటన పోరాట యోధురాలు కామ్రేడ్ జయమ్మకు విప్లవ జోహార్లు

      శ్రీకాకుళం ఉద్యమం సీనియర్ నాయకురాలు కామ్రేడ్ జయమ్మ ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది.          నేను బొడ్డపాడు గ్రామం వెళ్లిన పలు సందర్భాల్లో ఆమెను కలిసే వాడిని అనారోగ్యం వెంటాడుతున్న ఆమెలో విప్లవ నిబద్ధత సడల లేదు. కమ్యూనిస్టు ఉద్యమం ఆటుపోట్లు గాని సహచరుడు కుమారన్న మరణం గాని ఆమెను కుంగదీయ లేదు. జీవితాంతం విప్లవ నిబద్ధతతో జీవించిన వీరవనిత కామ్రేడ్ జయమ్మ. ఆమె  విప్లవజీవితం అందరికీ ఆదర్శం కావాలి. సిపిఐ(యమ్-యల్)లిబరేషన్ పార్టీ కేంద్ర కమిటీ తరపున కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ నైనాలశెట్టి మూర్తి కామ్రేడ్ జయమ్మకు విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.                       
   సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తుందని రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బి.బంగార్రావు తెలిపారు.ఆయన వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.        

Sunday, February 23, 2020

భీమ్ ఆర్మీ ఇచ్చిన భారత్ బంద్(23 ఫిబ్రవరి 2020)కు మద్దత్తుగా అనకాపల్లిలో పాల్గొన్న సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ నాయకులు.

         భీమ్ ఆర్మీ దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరపాలని ఇచ్చిన  పిలుపుకు సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ పార్టీ మద్దత్తు తెలియజేస్తుందని బంద్ ను జయప్రదం చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
      నేడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులు - యువకులు, ముస్లిం మైనారిటీ వర్గాలు, ప్రజాస్వామ్య శక్తులు, ప్రజలు ,ఎన్.ఆర్.సి ,సి.ఏ.ఏ, ఎన్.పి.ఆర్ లను వ్యతిరేకిస్తున్నారు.  ప్రజాస్వామ్యయుత ప్రజల నిరసనలను లెక్కచేయకుండా  బీజేపీ నిరంకుశంగా వ్యవహరిస్తోంది.  రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్లను రద్దు చేసే చర్యకు బీజేపీ ప్రభుత్వం పూనుకుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ రద్దును వ్యతిరేకిస్తూ సి.ఏ.ఏ,ఎన్.ఆర్.సి,ఎన్.పి.ఆర్ లను ఉపసంహరించుకోవాలని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, భీమ్ ఆర్మీ ఫిబ్రవరి 23న భారత బంద్ కు పిలుపునిచ్చింది. భీమ్ ఆర్మీ ఇచ్చిన భారత్ బంద్ కు సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ మద్దతిస్తున్నట్లు ఈ బంద్ ను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి బి. బంగార్రావు విజ్ఞప్తి చేశారు.

ఈ రోజు  (23 ఫిబ్రవరి 2020న) దేశ వ్యాప్తంగా జరిగిన బంద్ లో భాగంగా అనకాపల్లిలో పాల్గొన్న సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బి.బంగార్రావు, నాయకులు కె.జనార్దన్, దళిత సంఘాలు,ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజలు.

Thursday, February 20, 2020

శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ ఏ1 కాంట్రాక్టు కార్మికుల పి.ఎఫ్ సమస్యలు పరిష్కరించాలని AICCTU ఆధ్వర్యంలో ఈ రోజు(20.02.2020) పి.ఎఫ్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది.


        *ఎ-1 కాంట్రాక్టర్ నిరంకుశ వైఖరికి నిరసనగా శ్రీకాకుళం రిమ్స్  శానిటేషన్ కార్మికుల పి.ఎఫ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానికి పీఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్టు AICCTU జిల్లా కన్వీనర్ డి.గణేష్ తెలిపారు* ఈ రోజు ఉదయం రిమ్స్ కార్మికుల పీఎఫ్ ల్లో ఉన్న అవకతవకలును సరిచేయలని, పీఎఫ్ ల్లో జమలలో ఉన్న వ్యత్యాసాలును సరిచేయలని,పీఎఫ్ ల్లో ఉన్న తప్పులను సరిదిద్దాలని కోరుతూ రిమ్స్ గేట్ నుండి ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు అనంతరం స్థానిక బలగ జంక్షన్ లో గల పీఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షకార్యదర్శులు ఆకుల.శ్యామల, దమ్ము సింహాచలం AICCTU జిల్లా కన్వీనర్ డి గణేష్ మాట్లాడుతూ.. ఎ-1కాంట్రాక్టర్ రిమ్స్ ఆస్పత్రిలో పొరుగు సేవలు నిర్వహించి సుమారుగా నేటికి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా రిమ్స్ కార్మికులు సమస్యలు పట్టించుకోకుండా చాలా దారుణంగా వ్యహరిస్తున్నారని,రిమ్స్ లో కాంట్రాక్టు ప్రాతిపదికన 220 శానిటేషన్ పనుల్లో ఉన్నారని వాళ్ళ పీఎఫ్ ఏంటీ ఈ యస్ ఐ అని కనీసం ఇక్కడ పలికే నాధుడే లేదు ఆశ్చర్యం పడవలసిన అవసరం లేదు ఎందుకంటే కాంట్రాక్టు వాడు ముంబై లో ఉంటాడు, అంతా ఫోన్లో నే కథ అంతా నడుస్తుంది అని ఆవేదన వ్యక్తంచేశారు, రిమ్స్ అధికారులు అసలు శానిటేషన్ వారి సమస్యలు పెట్టావు కాంట్రాక్టుర్ నాలుగు సంవత్సరాలు నుండి పీఎఫ్ సక్రమంగా కట్టడం లేదు అని చెపుతున్న పట్టించుకోకుండా ఉన్నారు.జిల్లా.కలెక్టర్ గారుకి రిమ్స్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని అనేక సార్లు వినతిపత్రాలు ఇచ్చాము ప్రయోజనం మాత్రం శూన్యం...చివరికి గత నెల 28 వతేదీన సమ్మె నోటీసు ఇచ్చిన ఎ-1కాంట్రాక్టర్ గాని రిమ్స్ అధికారులుకు సీమకుట్టినట్టుకుడా లేదు అంటే వారి మొండివైఖరికీ నిదర్శనమని మండిపడ్డారు. ఇప్పటి కైనా ఎ-1కాంట్రాక్టర్ యూనియన్ తో  చర్చలు జరిపి సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని లేనియెడల నిరవధిక సమ్మెకు వెళ్ళాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబటి అరుణ,బి సంతోషి, కోనేటి ఈశ్వరమ్మ, కోటిలింగాల రుక్మిణి, బుదేవమ్మా,పైడి త్రినాథరావు,చిన్నారావు, చిత్రి లక్ష్మణరావు, మాధవరావు, నారు దమయంతి, అల్లాడ.సావిత్రి, ఐ వి లక్ష్మీ, లుట్ట పెంటయ్య,సురా రమణ,సరస్వతి, నిలవేణి,మౌనిక, అప్పన్న, ఈశ్వరమ్మ,తదితరులు పాల్గొన్నారు