ఎడిటోరియల్

Monday, July 26, 2021

జగ్గంపేట నియోజకవర్గంలో సర్వే చేసిన గిరిజనుల భూములకు పట్టాలు ఇవ్వాలి.

ఈరోజు అనగా ది.26 జులై 2021న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం మరియు జిల్లా ఫారెస్ట్ అధికారి కార్యాలయం ఎదుట జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న జగ్గంపేట మండలం గోవిందపురం, భావవరం, గంగవరం మండలం మల్లవరం కలిజోడుపేట, గండేపల్లి మండలం కె. గోపాలపురం గ్రామాల కొండదొర కులానికి చెందిన గిరిజనులు గత 50 సంవత్సరాలకు పైగా సాగుచేస్తున్న, ప్రభుత్వ అధికారులు సర్వే చేసిన భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం, అఖిల భారత వ్యవసాయ-గ్రామీణ కార్మిక సంఘం (అయార్ల) సి.పి.ఐ (యమ్.యల్) లిబరేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నా అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ వారికి, జిల్లా ఫారెస్ట్ అధికారి వారికి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నానుద్దేశించి మాట్లాడిన అయార్ల రాష్ట్ర కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, సి.పి.ఐ (యమ్.యల్) లిబరేషన్ రాష్ట్ర నాయకులు గొడుగు సత్యనారాయణ, పి.నరసరాజు, అయార్ల జిల్లా నాయకులు అల్లి చంద్రరావు, గిరిజన సంఘం జగ్గంపూడి రాజు, పందిరి రాము, కూడ కృష్ణ, మరిణమ్మ, సింగరయ్య, దేవమ్మా, రాముడు, కుంజన్న దొర మరియు అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.