ఎడిటోరియల్

Sunday, November 11, 2018

విద్యార్ధి – యువకులు ఐక్యంగా మోడీ–బాబులను గద్దెదించాలి. .....ఐసా




     
           మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ది.9 నవంబర్ 2018న కడపలో ఐసా(AISA) ఆధ్వర్యంలో ఐసా జిల్లా కార్యదర్శి డి.యమ్.ఓబులేష్ అధ్యక్షతన సదస్సు జరిగింది.
            ఈ కార్యక్రమములో ఐసా(aisa) జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సందీప్ సౌరవ్, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (డిల్లీ)(JNU) అధ్యక్షుడు  సాయి బాలాజీ,  సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ కేంద్ర కమిటీ సభ్యులు కా.. యన్. మూర్తి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
       
      ఈ సదస్సును ఉద్దేశించి వారు మాట్లాడుతూ మోడీ–బాబులు ఇచ్చిన ఎన్నికల హామీలను ఈ నాలుగున్నరేళ్ల పాలనలో విస్మరించారని దుయ్యబట్టారు. మోడీ యువతకు 2 కోట్లు ఉద్యోగాలు ఏవీ? అని ప్రశ్నించారు. మోడీ–బాబులు మీ గారడీ లెక్కలు మాని మీ పాలనలో మీరు చేసిన అసలు లెక్కలను ప్రజలకు వివరించండని డిమాండ్ చేశారు. ప్రజావ్యతిరేక, విద్యార్థి, యువత వ్యతిరేక విధానాలను అవలంభించిన మోడీ–బాబులను విద్యార్థి–యువకులు ఐక్యంగా గద్దెదించాలని  పిలుపునిచ్చారు.
   
 ఈ కార్యక్రమంలో  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)  కార్యదర్శి బాబులాల్, కడప జిల్లా cpi(ml) లిబరేషన్ నాయకులు రమణయ్య, కర్నూల్ జిల్లా ఐసా అధ్యక్షుడు యస్.నాగార్జున, కర్నూలు నగర కార్యదర్శి సురేంద్ర,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment