ఎడిటోరియల్

Monday, July 26, 2021

జగ్గంపేట నియోజకవర్గంలో సర్వే చేసిన గిరిజనుల భూములకు పట్టాలు ఇవ్వాలి.

ఈరోజు అనగా ది.26 జులై 2021న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం మరియు జిల్లా ఫారెస్ట్ అధికారి కార్యాలయం ఎదుట జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న జగ్గంపేట మండలం గోవిందపురం, భావవరం, గంగవరం మండలం మల్లవరం కలిజోడుపేట, గండేపల్లి మండలం కె. గోపాలపురం గ్రామాల కొండదొర కులానికి చెందిన గిరిజనులు గత 50 సంవత్సరాలకు పైగా సాగుచేస్తున్న, ప్రభుత్వ అధికారులు సర్వే చేసిన భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం, అఖిల భారత వ్యవసాయ-గ్రామీణ కార్మిక సంఘం (అయార్ల) సి.పి.ఐ (యమ్.యల్) లిబరేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నా అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ వారికి, జిల్లా ఫారెస్ట్ అధికారి వారికి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నానుద్దేశించి మాట్లాడిన అయార్ల రాష్ట్ర కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, సి.పి.ఐ (యమ్.యల్) లిబరేషన్ రాష్ట్ర నాయకులు గొడుగు సత్యనారాయణ, పి.నరసరాజు, అయార్ల జిల్లా నాయకులు అల్లి చంద్రరావు, గిరిజన సంఘం జగ్గంపూడి రాజు, పందిరి రాము, కూడ కృష్ణ, మరిణమ్మ, సింగరయ్య, దేవమ్మా, రాముడు, కుంజన్న దొర మరియు అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Tuesday, March 9, 2021

విశాఖ స్టీల్ ప్లాంట్ వందశాతం ప్రైవేటైజేషన్ చేస్తామన్న నిర్మలాసీతారామన్ చర్యలకు వ్యతిరేకంగా విశాఖలో మార్చి 23న ప్రజా పార్లమెంట్ నిర్వహిస్తాం!! ......కిసాన్ మహాసభ

 విశాఖ స్టీల్ ప్లాంట్ ను వందశాతం ప్రైవేటైజేషన్ చేస్తామన్న నిర్మలాసీతారామన్ చర్యలకు వ్యతిరేకంగా విశాఖలో మార్చి 23న "ప్రజా పార్లమెంటు" నిర్వహిస్తామని కిసాన్ సభ రాష్ట్ర కార్యదర్శి డి.హరినాధ్ తెలిపారు.

          కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ ప్రయోజనాల కోసం పబ్లిక్ రంగాన్ని కారుచౌకగా ఆదాని, అంబానీలకు పెడుతుందని విమర్శించారు. ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేసి పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ప్యాక్టరీని బిజెపి ప్రభుత్వం పోస్కో కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. యావత్ భారతదేశ రైతాంగం భగత్ సింగ్ స్ఫూర్తితో ఢిల్లీలో మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని హరినాథ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విశాఖ ఉక్కును ప్రైవేటైజేషన్ ఆపి పరిరక్షించాలని మార్చి14 వ తేదీ వరకు గ్రామాల వారీగా కిసాన్ పంచాయితీలు నిర్వహించి మోడీ తెచ్చిన చట్టాలను రద్దు చేయాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధానాలు విరమించాలని తీర్మానాలు చేయించాలని, 15వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద వందలాది మంది రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థి, యువకులతో "మాస్ అసెంబ్లీ" జరుగు తుందని జగన్మోహన్ రెడ్డి 18వ తేదీ నుండి జరిపే రాష్ట్ర అసెంబ్లీలో  తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. "ఛలో విశాఖ" కార్యక్రమంలో భాగంగా మార్చి 16 నుండి  22 వరకు పై రెండు డిమాండ్ల సాధన కోసం జిల్లాలో ప్రచారం నిర్వహించి భగత్ సింగ్ వర్ధంతి 23వ తేదీన విశాఖలో" ప్రజా పార్లమెంట్" నిర్వహించాలని "కార్మిక, కర్షక, మహిళా, విద్యార్థి, యువకుల ఐక్యతతో" స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా సిపిఐ(యమ్.యల్) లిబరేషన్ అనుబంధ సంఘాలైన అఖిలభారత వ్యవసాయ– గ్రామీణ కార్మిక సంఘం, అల్ ఇండియా కిసాన్ మహాసభ, ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్(AICCTU) సంయుక్త ఆధ్వర్యంలో విశాఖలో నిరసన ఆందోళన చేపట్టాలని  ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి హరినాథ్ తెలిపారు.

Monday, February 24, 2020

ప్రతిఘటన పోరాట యోధురాలు కామ్రేడ్ జయమ్మకు విప్లవ జోహార్లు

      శ్రీకాకుళం ఉద్యమం సీనియర్ నాయకురాలు కామ్రేడ్ జయమ్మ ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది.          నేను బొడ్డపాడు గ్రామం వెళ్లిన పలు సందర్భాల్లో ఆమెను కలిసే వాడిని అనారోగ్యం వెంటాడుతున్న ఆమెలో విప్లవ నిబద్ధత సడల లేదు. కమ్యూనిస్టు ఉద్యమం ఆటుపోట్లు గాని సహచరుడు కుమారన్న మరణం గాని ఆమెను కుంగదీయ లేదు. జీవితాంతం విప్లవ నిబద్ధతతో జీవించిన వీరవనిత కామ్రేడ్ జయమ్మ. ఆమె  విప్లవజీవితం అందరికీ ఆదర్శం కావాలి. సిపిఐ(యమ్-యల్)లిబరేషన్ పార్టీ కేంద్ర కమిటీ తరపున కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ నైనాలశెట్టి మూర్తి కామ్రేడ్ జయమ్మకు విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.                       
   సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తుందని రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బి.బంగార్రావు తెలిపారు.ఆయన వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.        

Sunday, February 23, 2020

భీమ్ ఆర్మీ ఇచ్చిన భారత్ బంద్(23 ఫిబ్రవరి 2020)కు మద్దత్తుగా అనకాపల్లిలో పాల్గొన్న సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ నాయకులు.

         భీమ్ ఆర్మీ దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరపాలని ఇచ్చిన  పిలుపుకు సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ పార్టీ మద్దత్తు తెలియజేస్తుందని బంద్ ను జయప్రదం చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
      నేడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులు - యువకులు, ముస్లిం మైనారిటీ వర్గాలు, ప్రజాస్వామ్య శక్తులు, ప్రజలు ,ఎన్.ఆర్.సి ,సి.ఏ.ఏ, ఎన్.పి.ఆర్ లను వ్యతిరేకిస్తున్నారు.  ప్రజాస్వామ్యయుత ప్రజల నిరసనలను లెక్కచేయకుండా  బీజేపీ నిరంకుశంగా వ్యవహరిస్తోంది.  రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్లను రద్దు చేసే చర్యకు బీజేపీ ప్రభుత్వం పూనుకుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ రద్దును వ్యతిరేకిస్తూ సి.ఏ.ఏ,ఎన్.ఆర్.సి,ఎన్.పి.ఆర్ లను ఉపసంహరించుకోవాలని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, భీమ్ ఆర్మీ ఫిబ్రవరి 23న భారత బంద్ కు పిలుపునిచ్చింది. భీమ్ ఆర్మీ ఇచ్చిన భారత్ బంద్ కు సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ మద్దతిస్తున్నట్లు ఈ బంద్ ను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి బి. బంగార్రావు విజ్ఞప్తి చేశారు.

ఈ రోజు  (23 ఫిబ్రవరి 2020న) దేశ వ్యాప్తంగా జరిగిన బంద్ లో భాగంగా అనకాపల్లిలో పాల్గొన్న సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బి.బంగార్రావు, నాయకులు కె.జనార్దన్, దళిత సంఘాలు,ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజలు.

Thursday, February 20, 2020

శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ ఏ1 కాంట్రాక్టు కార్మికుల పి.ఎఫ్ సమస్యలు పరిష్కరించాలని AICCTU ఆధ్వర్యంలో ఈ రోజు(20.02.2020) పి.ఎఫ్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది.


        *ఎ-1 కాంట్రాక్టర్ నిరంకుశ వైఖరికి నిరసనగా శ్రీకాకుళం రిమ్స్  శానిటేషన్ కార్మికుల పి.ఎఫ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానికి పీఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్టు AICCTU జిల్లా కన్వీనర్ డి.గణేష్ తెలిపారు* ఈ రోజు ఉదయం రిమ్స్ కార్మికుల పీఎఫ్ ల్లో ఉన్న అవకతవకలును సరిచేయలని, పీఎఫ్ ల్లో జమలలో ఉన్న వ్యత్యాసాలును సరిచేయలని,పీఎఫ్ ల్లో ఉన్న తప్పులను సరిదిద్దాలని కోరుతూ రిమ్స్ గేట్ నుండి ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు అనంతరం స్థానిక బలగ జంక్షన్ లో గల పీఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షకార్యదర్శులు ఆకుల.శ్యామల, దమ్ము సింహాచలం AICCTU జిల్లా కన్వీనర్ డి గణేష్ మాట్లాడుతూ.. ఎ-1కాంట్రాక్టర్ రిమ్స్ ఆస్పత్రిలో పొరుగు సేవలు నిర్వహించి సుమారుగా నేటికి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా రిమ్స్ కార్మికులు సమస్యలు పట్టించుకోకుండా చాలా దారుణంగా వ్యహరిస్తున్నారని,రిమ్స్ లో కాంట్రాక్టు ప్రాతిపదికన 220 శానిటేషన్ పనుల్లో ఉన్నారని వాళ్ళ పీఎఫ్ ఏంటీ ఈ యస్ ఐ అని కనీసం ఇక్కడ పలికే నాధుడే లేదు ఆశ్చర్యం పడవలసిన అవసరం లేదు ఎందుకంటే కాంట్రాక్టు వాడు ముంబై లో ఉంటాడు, అంతా ఫోన్లో నే కథ అంతా నడుస్తుంది అని ఆవేదన వ్యక్తంచేశారు, రిమ్స్ అధికారులు అసలు శానిటేషన్ వారి సమస్యలు పెట్టావు కాంట్రాక్టుర్ నాలుగు సంవత్సరాలు నుండి పీఎఫ్ సక్రమంగా కట్టడం లేదు అని చెపుతున్న పట్టించుకోకుండా ఉన్నారు.జిల్లా.కలెక్టర్ గారుకి రిమ్స్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని అనేక సార్లు వినతిపత్రాలు ఇచ్చాము ప్రయోజనం మాత్రం శూన్యం...చివరికి గత నెల 28 వతేదీన సమ్మె నోటీసు ఇచ్చిన ఎ-1కాంట్రాక్టర్ గాని రిమ్స్ అధికారులుకు సీమకుట్టినట్టుకుడా లేదు అంటే వారి మొండివైఖరికీ నిదర్శనమని మండిపడ్డారు. ఇప్పటి కైనా ఎ-1కాంట్రాక్టర్ యూనియన్ తో  చర్చలు జరిపి సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని లేనియెడల నిరవధిక సమ్మెకు వెళ్ళాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబటి అరుణ,బి సంతోషి, కోనేటి ఈశ్వరమ్మ, కోటిలింగాల రుక్మిణి, బుదేవమ్మా,పైడి త్రినాథరావు,చిన్నారావు, చిత్రి లక్ష్మణరావు, మాధవరావు, నారు దమయంతి, అల్లాడ.సావిత్రి, ఐ వి లక్ష్మీ, లుట్ట పెంటయ్య,సురా రమణ,సరస్వతి, నిలవేణి,మౌనిక, అప్పన్న, ఈశ్వరమ్మ,తదితరులు పాల్గొన్నారు

Wednesday, December 5, 2018

2018 డిశంబర్ 03న నూజివీడు కేంద్రంలో విజయవంతమైన"జన జాగరణ ర్యాలీ–సభ"






నూజివీడు: సి.పి.ఐ(యమ్.యల్)లిబరేషన్ కృష్ణాజిల్లా కమిటీ ఆధ్వర్యంలో ది.03 డిశంబర్ 2018న డివిజన్ కేంద్రం నూజివీడులో పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ డి. హరినాధ్ అధ్యక్షతన "జనజాగరణ ర్యాలీ – సభ"  జరిగింది.
  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బి. బంగార్రావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
  కార్ల్ మార్క్స్ 200వ జయంతిని పురస్కరించుకుని ది.13 డిశంబర్ 2018న విజయవాడలో జరుగు సదస్సుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దీపాంకర్ భట్టాచార్య ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారన్నారు. ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
  ఈ కార్యక్రమంలో AIPWA రాష్ట్రఅధ్యక్షురాలు కామ్రేడ్ టి. అరుణ, డి. పుల్లారావు, యస్. నాగేశ్వరరావు, ch. బాబూరావు, కళావతి , ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Tuesday, December 4, 2018

ది.04 డిశంబర్ 2018న సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ అనంతపురం జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశం.


అనంతపూర్: సి.పి.ఐ(యమ్.యల్)లిబరేషన్ అనంతపురం జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశం ది.04 డిశంబర్ 2018న అనంతపూర్ లో జరిగింది.
    ఈ కార్యకర్తల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కా.. బి. బంగార్రావు మాట్లాడారు. డిశంబర్ 13 న విజయవాడలో సదస్సు జరుగుతుందని ఆ సదస్సులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దీపాంకర్ భట్టాచార్య ముఖ్య అతిధిగా పాల్గొంటారని ఈ సదస్సులో పాల్గొని జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
   ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కా..T.S వలి, G.నల్లప్ప, తులసీ, శ్రీను, చౌడప్ప తదితరులు పాల్గొన్నారు.

Wednesday, November 14, 2018

సి.బి.ఐ, ఆర్.బి.ఐ, సుప్రీంకోర్టు - రాజ్యాంగ సంస్థలు, పాలన యంత్రాంగంపై పెచ్చుమీరుతున్న మోడి ప్రభుత్వపు దాడి.

ఎం.ఎల్ అప్డేట్ అక్టోబర్ 30 సంపాదకీయం.
సి.బి., ఆర్.బి., సుప్రీంకోర్టు - రాజ్యాంగ సంస్థలు, పాలన యంత్రాంగంపై పెచ్చుమీరుతున్న మోడి ప్రభుత్వపు దాడి.

     2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది, పాలనా యంత్రాంగాలపై మోఢి ప్రభుత్వపు దాడి నానాటికి తీవ్రతరం చేస్తుంది. రాజ్యాంగ బద్ద సంస్థలను నిర్వీర్యం చేసి, భా..పా - ఆర్.ఎస్.ఎస్ మనువాద అజెండాకు మడుగులు వత్తే విధంగా అధికార యంత్రాంగాన్ని ప్రభావితం చేసే ప్రయత్నాలు ఇప్పటి వరకు తెరవెనుక సాగాయి. కాని ఇప్పుడు ఏకంగా బహిరంగ బెదిరింపులకు దిగుతూ, మాట వినని ఆయా సంస్థల ఉన్నతాదికారులతో డి అంటే డి అనే స్థాయికి భా..పా ప్రభుత్వం తెగబడుతుంది. తన జవాబుదారి తనానికి ప్రశ్న ఎదురయ్యే సరికి భా..పా ప్రభుత్వం ప్రశ్న లేవనెత్తే ప్రతి సంస్థ అధికారాన్ని నిర్వీర్యం చేసేందుకు బెదిరించి మెడలు వంచే పనికి పూనుకుంటుంది. వేడి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లతో పాటు సుప్రీం కోర్టుకు కూడా తగిలింది.
        గత యు.పి. ప్రభుత్వ హయాంలో సి.బి. డిపార్టిమెంటు ని "పంజరంలో బంధించబడిన చిలుక" అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం మన అందరికి గుర్తుండే ఉంటుంది. భాజపా ప్రభుత్వం వచ్చాక పంజరంలోని చిలుకను స్వేచ్చగా వదిలేసే మాట అటుంచి, పంజరాన్ని మరింత ఇరుకుగా చేసే పనులే చేస్తుంది. తగిన సమయంలో సి.బి. ని ఉసికొల్పి వివిధ రాష్ట్రాలలో పాలక-ప్రతిపక్షాలను దారిలో తెచ్చుకునేందుకు, తమతో పొత్తు కుదుర్చుకునేలా చేసేందుకే మాత్రమే సి.బి. ని ప్రయోగిస్తుంది. ప్రక్రియలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎంఫోర్స్మెంట్ డైరెక్టరెట్ లు పాలక ఎన్.డి. ప్రభుత్వ భాగస్వాములుగా తయరయ్యాయి.
           అభ్యంతరాలన్నిటిని పెడచెవిన పెడుతూ, గుజరాత్ నరమేధపు రోజుల నుంచి తనకు అత్యంత నమ్మకస్తుడిగా వ్యవహరిస్తున్న రాకేష్ ఆస్థానా ని సి.బి. ప్రత్యేక డైరెక్టరుగా మోడి నియమించుకున్నాడు. అంతేకాక, అవినీతి కేసులలో అధికారిని విచారించాలాన్నా సి.బి. లేదా మరే ఇతర దర్యాప్తు సంస్థైనా ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా పొందాలన్న నియమాన్ని చేరుస్తూ అవినీతి నిరోధక ఛట్టంలో మార్పులు తెచ్చారు. కాని రఫెల్ ఒప్పందం గురించి భయటపడ్డ విషయాలతో ఖంగుతిన్న మోడి సి.బి. విషయంలో సైతం జాగ్రత్త వహించాలన్న స్పృహలోకి వచ్చాడు. దాని ఫలితంగానే, సి.బి. మొత్తాన్ని మోడి-షా కబంధ హస్తాలలోకి తీసుకోవాలన్న స్వయంగా ప్రభుత్వం చేస్తున్న కుట్రను మనం చూస్తున్నాం.
                 మారిన అవినీతి ఛట్ట నియమం ప్రకారం, ప్రధాని స్వయంగా సభ్యుడైన కొలీజియం ద్వారా నియమితుడై 2019 జనవరి వరకు ఉధ్యోగంలో ఉండవల్సిన సి.బి. డైరెక్టర్ ఆలోక్ వర్మ స్వయంగా రాకేష్ ఆస్థానా అవినీతిపై దర్యప్తు చేపట్టడానికి అనుమతి కోరగా, ప్రభుత్వం సి.బి. డైరెక్టర్ ఆలోక్ వర్మనే తొలగించి స్థానంలో అవినీతికి మారుపేరుగా ఖ్యాతి గడించిన ఎం.నాగేశ్వరరావుని తాత్కాలిక డైరక్టర్ గా నియమించడం జరిగింది. అంతే కాక ఆలోక్ వర్మ కధలికలను కట్టడి చేసేందుకు తన అధికారిక నివాసం చుట్టూ నిఘా వర్గాలను నియమించటం జరిగింది. రాకేష్ అస్థానా తన చరిత్ర ఘనత ఏపాటిదో, గుజరాత్ లో పనిచేస్తుండగా గొధ్రా అల్లర్ల కేసులో మోడి పక్షం వహించడం ద్వారా, భారీ స్థాయిలో సొమ్ములను పోలీస్ సంక్షేమ నిధి నుండి భా..పా ఎన్నికల నిధిలోకి మరల్చడం ద్వారా నిరూపించుకున్నాడు. అలాగే నాగేశ్వరరావు కూడా ఒరిస్సా లోని ఫైర్ బ్రిగేడ్ యూనిఫార్మ్ స్కాం లాంటి అవినీతి కేసుల ద్వారా, సంఘ్ పరివార్ అరాచక చర్యలకు అనేక సార్లు తన వ్యాఖ్యానాల ద్వారా మద్ధతు తెలుపుతూ తన అర్హతను నిరూపించుకున్నాడు. ఒకపక్క ఇటువంటి నమ్మకస్తులైన తాబేదారులతో మోఢి ప్రభుత్వం సి.బి., సి.వి.సి లాంటి సంస్థలను నింపుతూ మరోపక్క కీలకమైన కేసులలో దర్యాప్తు చేపడుతున్న అధికారులపై తొలగింపులు, స్థానచలన ఉత్తర్వులు జారీ చేస్తూ వారిని వేధింపులకు గురిచేస్తుంది. సి.బి. కార్యాలయంలో కీలకమైన దస్తావేజులను మాయం చేయడానికి ఇంటెలిజన్స్ అధికారుల పేరుతో గుర్తుతెలియని వ్యక్తులను పంపే స్థాయికి తెగించింది.
             సి.బి. వ్యవహారంలో ప్రభుత్వం అనుసరించిన తీరు ఆర్ధిక, ప్రభుత్వ పాలన, న్యాయ శాఖల సహా దేశంలోని ఇతర ప్రధానమైన సంస్థలతో అది అనుసరించబోయే తీరుకు సంకేతంగా మనం అర్ధం చేసుకోవచ్చు. క్రిందటి ఆర్.బి. గవర్నర్ అయిన రఘురాం రంజన్ ను రెండవ సారి కొనసాగించేందుకు నిరాకరించటం, అత్యంత దారుణమైన-విచిత్రమైన నిర్ణయమైన మోఢి ప్రభుత్వపు నోట్ల రద్దు చర్యను సమర్దించవల్సిందిగా ఆర్.బి. ని బలవంత పెట్టడం లాంటి చర్యలతో మోఢి ప్రభుత్వం బ్యాంకింగ్ రంగ స్వయం ప్రతిపత్తికి, స్వతంత్ర నియంత్రణాధికారానికి కోత విధంచడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. కార్పొరేట్ ఎగవేతదారులపై మరింత ఖఠినమైన నియమాలను రూపొందించుకోవాలని, తన స్వంత నగదు నిల్వలను కాపాడుకోవాలని, ఆర్.బి. తో లావాదేవీలు జరిపే భాగస్వాములందరిపై నియంత్రణాధికారం తనకే ఉండాలన్న ఆర్.బి. నిర్ణయాలపై ప్రభుత్వం నుంచి, ఆర్.ఎస్.ఎస్ మద్ధతుదారులైన ఆర్ధిక నిపుణుల నుంచి అవిరామంగా దాడి తీవ్రమవుతూ వస్తుంది. తదనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ల బోర్డులో ఆర్.ఎస్.ఎస్ ఆర్ధిక నిపుణులు నియమింపబడటం కూడా జరిగింది.
                  బహుశా వీటన్నిటిని మించిన బహిరంగ ఘర్షణ ఏదో ప్రభుత్వానికి, సుప్రీం కోర్టుకి మధ్య జరగబోతున్నట్లు sకనబడుతుంది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును మొదట ఆహ్వానించి తరువాత పూర్తిగా మాటమార్చింది. అమలుచేయగల విధంగా మాత్రమే తీర్పులు వెలువరించాలని ఏకంగా సుప్రీంకోర్టుకే అమిత్ షా సలహాలివ్వడం మనం గమనించాం. అక్కడితో ఆగక, సుప్రీంకోర్టు తీర్పును అమలుచేసేందుకు ప్రయత్నించిన కేరళా ఎల్.డి.ఎఫ్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో పెకలించాలని పార్టి కేడర్ కు పిలుపునివ్వడం జరిగింది.అయోధ్య స్థలం ఎవరికి చెందుతుందన్న విషయంపై సుప్రీంకోర్టు జనవరిలో తీర్పు చెప్పనున్న నేపధ్యంలో, భా..పా మంత్రులు "హిందువుల సహనాన్ని పరీక్షించొద్దు" అంటూ బాహాటంగా బెదిరింపు-రెచ్చగొట్టే తరహా ప్రకటనలు చేస్తున్నారు. హిందుత్వ ఉన్మాద మూకలైతే సామాజిక మాధ్యమాలలో మరింత బరితెగించి కూల్చబడ్డ బాబ్రి మసీదు గోపుర స్థానంలో సుప్రీంకోర్టు గోపురపు చిత్రాలు పెట్టి స్పష్టమైన బెదిరింపు సంకేతాలు పంపుతున్నారు.
                   మోడి ప్రభుత్వం చేస్తున్న దాడులన్ని కేవలం ముస్లింలు, దళితులు, అర్బన్ నక్సల్స్ పైనే అనుకుంటే చాలా పొరపాటు చేసినట్లే. మనం ఒకసారి స్పృహలోకి వచ్చి పరిస్థితులను గమనించాలి. దాడులు కేవలం మైనార్టిలు, అణగారిన - బలహీన వర్గాలకే పరిమితం కాదు. ఇది ఏకంగా ప్రజాస్వామిక పరిపాలనా యంత్రాంగం పైనా, రాజ్యాంగ బద్ద సంస్థలపైన ఎక్కుపెట్టిన దాడి. ఏదైనా విపత్తు ఒక ప్రాంతాన్ని తాకితే, అది చుట్టుపక్కల ప్రాంతాలకి కూడా వినాశకారిగా మారుతుంది. ప్రస్తుతం మోడి ప్రభుత్వ చర్యలు సమగ్ర స్థాయిలో ఆర్ధిక-సామాజిక-రాజకీయ సంక్షోభానికి సంకేతంగా కనబడుతున్నాయి.ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొడి అనే పెను విపత్తునుంచి భారతదేశాన్ని మనమే రక్షించుకోవాలి.