ఎడిటోరియల్

Monday, October 1, 2018

2018 అక్టోబర్ 1 న అనకాపల్లి పట్టణంలో సాగిన సి.పి.ఐ(యమ్.యల్)లిబరేషన్ "జన జాగరణ యాత్ర"



             2018 అక్టోబర్ 1న అనకాపల్లి పట్టణంలో సి.పి.ఐ(యమ్.యల్)లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ " జన జాగరణ యాత్ర" జరిగింది.
     ఈ యాత్ర స్థానిక బస్ స్టాండ్ నుండి ర్యాలీగా బయలు దేరి స్టేట్ బ్యాంక్ సెంటర్, తహశీల్దార్ కార్యాలయం   మీదుగా మున్సిపల్ కార్యాలయం, ఆర్.డి.ఓ ఆఫీస్, నెహ్రూ చౌక్ మీదుగా బస్ స్టాండ్ వరకు నిర్వహించడం జరిగింది.
    ఈ యాత్రలో పాల్గొన్న జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు సి.పి.ఐ(యమ్.యల్)లిబరేషన్ జిందాబాద్!, బి.జె.పి–మోడీ ఫాసిస్టు పాలనను ఓడించండి!, చంద్రబాబు దగా కోరు పాలనను వ్యతిరేకించండి!, పేదల సాగులో వున్న ప్రభుత్వ పోరంబోకు, బంజరు, అటవీ భూములలో హక్కులు కల్పించాలని, నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను ఏజెన్సీలో చేర్చాలని, ఉపాధి హామీ పథకంలో 300 పని దినాలు కల్పించాలని, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ నినదించారు.

1.10.2018న సి.పి.ఐ(యమ్.యల్)లిబరేషన్ ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణంలో విజయవంతం అయిన కామ్రేడ్ పి.శంకర్ వర్ధంతి సభ





ఈ రోజు అనగా 1 అక్టోబరు 2018 న అనకాపల్లి పట్టణంలో సి.పి.ఐ(యమ్.యల్)లిబరేషన్ ఆధ్వర్యంలో అమరుడు కామ్రేడ్ పి.శంకర్ గారి వర్ధంతి సభ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బి. బంగార్రావు అధ్యక్షతన జరిగింది.
      ఈ సభలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ యన్. మూర్తి, రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్స్ డి.హరినాధ్, వై. అర్జునరావు, టి.అరుణ, టి. సన్యాసిరావు, కె.జనార్దన్, యమ్. లచ్చబాబు, బి. వాసుదేవరావు, పి.యస్. అజయ్ కుమార్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

కుల రక్కసి కాటుకి బలౌతున్నది ఎవరు?

ఈ ప్రశ్నలకు బదులుందా?

కులాహంకార హత్యల మీద సోషల్‌ మీడియాలో అనుకూల, వ్యతిరేక వాదనలు చాలా జరుగుతున్నాయి. కొంతమంది 'మరి దళితులకు రిజర్వేషన్లు మాత్రం ఎందుకు?' అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

దానికి సమాధానంగా కింది పోస్టు వైరల్‌ అవుతోంది.

* మంచి బట్టలు వేసుకోకూడదని నీ మీద ఎప్పుడైనా దాడి జరిగిందా?
* తలపాగా పెట్టుకున్నావనీ, గుర్రమెక్కి ఊరేగావని నీ మీద ఎవరైనా దాడి చేశారా?
* బాగా చదువుతున్నావని రాళ్ళ దాడి ఎప్పుడైనా ఎదుర్కొన్నావా?
* ఇష్టమైన నాయకుడి పాట రింగ్‌ టోన్‌ పెట్టుకున్నాడన్న కారణంతో, ఘోరంగా హత్య గురైన వాడెవడైనా మీవారిలో ఉన్నాడా?
* ఫిర్యాదు ఇవ్వడానికి వెళితే ఆడవాళ్ళను బట్టలు విప్పి నడిరోడ్డు మీద నిలబెట్టిన సందర్భాలు ఎవరి విషయంలో జరిగాయి?
* గుడిలోకి, బడిలోకి అడుగు పెట్టొద్దంటూ నిన్ను ఎవరైనా కొట్టి చంపారా?
* ఆవులు, గేదెలు, కుక్కలు, పందులు తిరుగుతున్న చెరువులో కూడా నువ్వు మంచినీళ్ళు అంటుకోవడానికి వీల్లేదని నిన్నెప్పుడైనా ఆపారా?
* వేరే కులంవాడు తాగే గ్లాసు ముట్టుకున్నావని మలం నోట్లో పెట్టి తినమని కొట్టారా?
* ఎవరి అక్క చెల్లెళ్ళను జోగిని, బసివిగా చేశారు? చేస్తున్నారు?
* మంత్రాలు చేస్తున్నావనే నెపంతో ఊరంతా కలిసి చెట్టుకు కట్టేసి, కొట్టి చంపి సజీవ దహనాలు ఎక్కడ చేశారో చూపించు?
* అగ్రకుల ఊరి పెద్ద కనిపిస్తే లేచి కూర్చోలేదనే కారణంతో వికలాంగురాలని కూడా చూడకుండా, ఆడవాళ్లను నగంగా ఊరేగించిన సందర్భం ఎవరిలో జరిగింది?
* అమ్మాయిని ప్రేమిస్తే- ఆ అబ్బాయి ఇంట్లో ఆడవాళ్ళను సామూహిక అత్యాచారం చేయాలని ఎవరి విషయంలో పంచాయతీలు తీర్పులిచ్చాయి?
ఒక ఖైర్లాంజీ, ఒక చుండూరు, ఒక కారంచేడు, ఒక నీరుకొండ, ఒక ప్యాపిలి, ఒక కిలవెన్మని, ఒక వేంపెంట, ఒక దాద్రి, ఒక నోయిడాఘర్‌ ... నా ప్రజలను కాటేసిన కుల రక్కసి రక్త దాహానికి తార్కాణాలు. బహుజనుల మీద రోజూ జరుగుతున్న దాడులకు మరుగు దొడ్ల నుంచి పార్లమెంటు మెట్ల దాకా అన్నీ సాక్ష్యాలే! మరి ఇలాంటి వివక్షా, అమానుషం ఇంకెవరి విషయంలోనైనా ఉందా?

ప్రధాన సమాచార కమీషనర్ ని నియమించని రాష్ట్ర ప్రభుత్వం

"The Chief Information Commissioner in exercise of
his/her powers allocate Ministries/
Department/Organisations/Union Territories among
all Commissioners for carrying out the functions of
the Commission as contained in Section 18, 19 and
20 of the Right to Information Act 2005".

ప్రధాన సమాచార కమీషనర్ నియామకం చేయకుండా ముగ్గురు సమాచార కమీషనర్లను మాత్రం నియమించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. మరి నియమించిన ముగ్గురు కమీషనర్లకు శాఖల భాద్యతలు ఎవరు కేటాయిస్తారు?

సి.పి.ఐ(యమ్.యల్)లిబరేషన్ లో చేరిన డి.వై.ఎఫ్.ఐ మాజీ సభ్యులు.

సిపిఐ(యమ్.యల్ ) లిబరేషన్ లో చేరికలు
...........................................................
 డివైఎఫ్ఐ మాజీ జిల్లా సహయ కార్యదర్శి గాయాల రమేష్ తో పాటు పలువురు సిపిఐ(యమ్.యల్) లిబరేషన్ లో చేరారు.  సోమవారం నియోజకవర్గ కేంద్రంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా  సమక్షంలో జనగామ జిల్లా,  పాలకుర్తి మండలంలోని  సిరిసన్న గూడెం గ్రామానికి చెందిన గాయాల రమేష్,  గ్యార కుమార్ తో పాటు పలువురు యువకులు ఆ పార్టీలో చేరారు. రమేష్ గతంలో  విద్యార్థి సంఘం డివిజన్ నాయకుడిగా పని చేశారు ఆ తర్వాత యువజన సంఘం జిల్లా సహయ కార్యదర్శిగా కొనసాగారు.  సిపిఐ (యమ్.యల్) లిబరేషన్ సిద్దాంతాలకు ఆకర్షితులై చేరుతున్నట్లు జిల్లా కార్యదర్శి రమేష్ రాజా తెలిపారు.   ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై యువత పోరాడాలని  పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని గాయాల రమేష్ తెలిపారు.   ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ నాయకులు కొమురయ్య, దేవరాజు, జీడి సోమయ్య, మండల నాయకులు తూర్పాటి సారయ్య  తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న" జన జాగరణ యాత్ర"

కృష్ణా జిల్లా, నూజివీడు డివిజన్ లో సి.పి.ఐ(యమ్.యల్)లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న"జన జాగరణ యాత్ర"

అఖిల భారత వ్యవసాయ–గ్రామీణ కార్మిక సంఘం(అయర్లా) 6వ జాతీయ మహాసభ 2018 నవంబర్19, 20,జహనాబాద్,బీహార్.