సిపిఐ(యమ్.యల్ ) లిబరేషన్ లో చేరికలు
...........................................................
డివైఎఫ్ఐ మాజీ జిల్లా సహయ కార్యదర్శి గాయాల రమేష్ తో పాటు పలువురు సిపిఐ(యమ్.యల్) లిబరేషన్ లో చేరారు. సోమవారం నియోజకవర్గ కేంద్రంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా సమక్షంలో జనగామ జిల్లా, పాలకుర్తి మండలంలోని సిరిసన్న గూడెం గ్రామానికి చెందిన గాయాల రమేష్, గ్యార కుమార్ తో పాటు పలువురు యువకులు ఆ పార్టీలో చేరారు. రమేష్ గతంలో విద్యార్థి సంఘం డివిజన్ నాయకుడిగా పని చేశారు ఆ తర్వాత యువజన సంఘం జిల్లా సహయ కార్యదర్శిగా కొనసాగారు. సిపిఐ (యమ్.యల్) లిబరేషన్ సిద్దాంతాలకు ఆకర్షితులై చేరుతున్నట్లు జిల్లా కార్యదర్శి రమేష్ రాజా తెలిపారు. ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై యువత పోరాడాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని గాయాల రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ నాయకులు కొమురయ్య, దేవరాజు, జీడి సోమయ్య, మండల నాయకులు తూర్పాటి సారయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment