ఎడిటోరియల్

Saturday, October 13, 2018

అర్ధరాత్రి మున్సిపల్ కార్మికుల అక్రమ అరెస్టులు

       గుంటూరుజిల్లా మంగళగిరిలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో పట్టణంలో శానిటేషన్ అస్తవ్యస్తంగా ఉన్నందున శానిటేషన్ శుభ్రం చేసే నిమిత్తం మునిసిపల్ అధికారులు పోలీస్ వారి సహకారంతో ముందస్తు జాగ్రత్తలలో భాగంగా కార్మిక సంఘ నాయకులను ది.12.10.2018 అర్ధరాత్రి ముందస్తు అరెస్ట్ చేయగా , ఈ విషయం తెలుసుకున్న కార్మికులు అర్ధరాత్రి అప్పటికప్పుడు పురుషులతో పాటు మహిళా కార్మికులు కూడా పోలీస్ స్టేషన్ కి ప్రదర్శనగా నినాదాలు చేసుకుంటూ వచ్చి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు.
            జీఓ నెం.279 రద్దు చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పోలీస్ జులం నశించాలని నినాదాలతో స్టేషన్ దద్దరిల్లింది.
 అనంతరం మొత్తం 72 మంది పై ముందస్తు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు  వ్రాసుకుని, తెల్లవారు జామున వదిలివేశారు.
       అరెస్ట్ అయిన వారిలో CPI(ML)లిబరేషన్ ఏరియా కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్, సీపీఎం పట్టణ కార్యదర్శి S S చెంగయ్య , CITU నాయకులు భాగ్యరాజ్,   రామచంద్రరావు, కమలాకర్, నాగరాజు, నాగార్జున , AICCTU నాయకులు జి.దుర్గారావు, జలసూత్రం వాసు, రాంబాబు, గంజి వెంకయ్య లతో పాటు శానిటేషన్ కార్మికులు వున్నారు.

No comments:

Post a Comment