ఎడిటోరియల్

Saturday, October 6, 2018

గుంటూరుజిల్లా వినుకొండ మండలం, కొప్పుకొండలో పేదలపై TDP నాయకుల వేధింపులను వ్యతిరేకించండి!

         తేది.6.10.2018 గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని
 కొప్పుకొండ పంచాయితీ పరిధిలో గల ప్రభుత్వ భూమి , దేవాదాయశాఖ భూములు , ఈనాం భూములను తెలుగుదేశంపార్టీ నాయకులు  ఏజీపీ (AGP )           రామ కోటేశ్వరరావు మరియు ఆయన బందు మిత్రులు కలసి ఆక్రమించి, కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారు.
      ఈ నేపధ్యంలో CPI (ML)లిబరేషన్ పార్టీ జిల్లా నాయకత్వం భూములను, ప్రభుత్వ రికార్డులను పరిశీలించగా ఇవి ప్రభుత్వ భూములు,దేవాదాయశాఖ భూములు, ఈనం భూములని నిర్ధారణ అయినది. ఇప్పటికైనా   మీ భుకాయింపులను మానుకొని,             ఆ భూములను స్వాధీనం చేయాలని, లేని పక్షంలో ప్రజా పోరాటాలు మరో వైపు న్యాయపోరాటం చేస్తామని, ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూములను వదిలివేయాలని, పేదల భూములను పేదలకు అప్పగించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో  ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని, మీకు  మీ పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెపుతారని హెచ్చరించారు.         
          ఈ కార్యక్రమంలో లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి MPరాందేవ్, జిల్లా కమిటీ సభ్యులు తోట ఆంజనేయులు, Aప్రభాకర్,బడుగు రమేష్,నాయకులు బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment