ఎడిటోరియల్

Sunday, October 21, 2018

గుడిలో మహిళలు ప్రవేశం BJP పాలిత రాష్ట్రాలలో ఒకలాగ కమ్యూనిస్టు పార్టీ పాలిత రాష్ట్రాలలో మరోలా వ్యవహరిస్తున్న ఆర్.ఎస్.ఎస్ , సంఘ్ మూకలు.

     శబరిమలలో మహిళల ప్రవేశం ఉండాలి అని చెప్పింది సుప్రీంకోర్ట్. సుప్రీం కోర్ట్ తీర్పు అంతిమం, తప్పకుండా దేశం మొత్తం పాటింవలసిందే..

    మా మత విశ్వాసాలకు అది అడ్డంకి కదా మేం ఆ తీర్పును పాటించము అంటే రేపు ముస్లిం మహిళలు కూడా వేల మంది రోడ్ల పైకి వచ్చి మా భర్తలు తలాక్ తలాక్ అంటే మాకు విడాకులు అయిపోతాయ్ మద్యలో మీకేం బాదా అంటారు మరి దానిని ఒప్పుకు౦దామా?

    రేపు రాజస్తాన్ లో రాజపుత్ స్త్రీలు కొన్ని వేల మంది బయటకి వచ్చి మా భర్త చనిపోతే సతీసహగమనం చేస్తాం మీకేం అభ్యంతరం అని అంటే ఏం చేద్దాం?

     రేపు ఎనిమిదేళ్ళ అమ్మాయిలు బయటకి వచ్చి మేం పెళ్లి చేసుకుంటాం మా అమ్మా నాన్న చేస్తాం అంటున్నారు మద్యలో ఈ ప్రభుత్వం ఎవరు మా కులంలో ఇట్లనే ఉంటది అని అన్నారు అనుకోండి బాల్యవివాహాలను అంగీకరించుదామా?
     అందువల్ల మత విశ్వాసాలకు మరియు రాజ్యాంగానికి మద్యలో ఘర్షణ ఏర్పడితే రాజ్యా౦గమే చెల్లుతుంది.
   
     మహారాష్ట్ర లోని BJP ప్రభుత్వం శని సి౦గనాపూర్ లో మహిళలను అనుమతి౦చడం జరుగుతుంది. అదే BJP ప్రభుత్వం కేరళలో శబరిమల అనుమతిని నిరాకరిస్తుంది. కారణం ఒక్కటే దక్షిణ భారతదేశం(south)లోకి BJP ప్రవేశించాలని చాలా కాలం నుండి నానా తంటాలు పడుతుంది. కాని సాద్యం కాలేదు. ఇప్పుడు ప్రజల విశ్వాసాన్ని పెట్టుబడిగా మార్చుకుని కేరళలో ప్రవేశించాలని చూస్తుంది.
    శబరిమలై కి ఎవరైనా మహిళలు అడుగుపెడితే అత్యాచారాలు జరుపుతాం అని ఒకాయన అంటుండు. ఇంకొకాయన మహిళలు శబరిమలకు పోతే రెండు ముక్కలుగా నరికి ఒక ముక్క కేరళ cm కు పంపుతాడట.
భక్తులపైన అత్యాచారాలు జరుపుతారా ఎవరైనా? భక్తులను నరుకుతారా ఎవరైనా?
   
       ఏ దేవుడు చెప్పలేదు కదా నా దగ్గరకు వస్తే నరకమని.. అత్యాచారాలు చేయండి అని..

- ప్రో౹౹కె.నాగేశ్వర్.

No comments:

Post a Comment