ఎడిటోరియల్

Monday, October 8, 2018

గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం నాయకులు సమ్మెను నిర్వీర్యం చేసే విధానాలను తిప్పి కొట్టిన మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులు.

     ది.8.10.2018న గుంటూరుజిల్లా మంగళగిరిలో మునిసిపల్ శానిటేషన్ కార్మికులు చేస్తున్న సమ్మె 5 వ రోజుకు చేరుకుంది. ఈ రోజు శానిటేషన్  కార్మికులు గౌతమ్ బుద్ధ రోడ్ మీద మానవహారంగా ఏర్పడి తమ సమస్యలు పరిష్కరించి,తమజీవితాలు రోడ్డున పడకుండా చూడాలని, 279 జి.ఓ రద్దు చేసి, సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.
        ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు కొంతమంది స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద శానిటీషన్ చేస్తుండగా కార్మికులు వారిని అడ్డుకొని  వారి చేతుల్లో వున్న చీపురు కట్టలు , బట్టలు లాక్కొని వారిని తరిమి వేశారు. అంతటా వారు ట్రాక్టర్ పై వేసిన చెత్త,చెదారాన్ని కిందకి పడవేసి అక్కడి నుండి ట్రాక్టర్ని పంపి వేసి, మా సమస్యలు తీరెంతవరకు పోరాడుతామని, ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదన్నారు.
            ఈ కార్యక్రమంలో సిపిఐ(యమ్.యల్)లిబరేషన్ ఏరియా కార్యదర్శి Aప్రభాకర్, AICCTU నాయకులు G.దుర్గారావు, తుపాకుల శివ, బాపనపల్లి వెంకటేశ్వరరావు, T.హనుమంతరావు, తడిశెట్టి శ్రీను, సుకన్య, మరియమ్మ, వెంకయమ్మ, సీపీఎం పట్టణ కార్యదర్శి, చెంగయ్య, సీఐటీయూ నాయకులు రామచంద్రరావు, నాగరాజు, నాగార్జున, CPI పట్టణ కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు, ఏఐటీయూసీ నాయకులు గంజి వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment