ఎడిటోరియల్

Friday, October 19, 2018

గిరిజనులపై తప్పుడు కేసులు పెట్టి,వారిని వేధిస్తున్న ప్రభుత్వ అధికారుల చర్యలకు నిరసనగా ఏలేశ్వరంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం.

  తూర్పు గోదావరిజిల్లా, రంపచోడవరం ఏజెన్సీ డివిజన్, రాజవొమ్మంగి తహశీల్దార్(ఎమ్మార్వో)గారిని  గిరిజనులకు ఇవ్వవలసిన  గిరిజన కుల దృవీకరణ పత్రాలు  గిరిజనేతరులకు ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయం అంటూ ఈ సమస్యపై  రాజవొమ్మంగి తహశీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయం వద్ద సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో వెయ్యి మంది గిరిజనులతో "ధర్నా" చేసి 24 గంటలు "వంటావార్పు" కార్యక్రమం చేయడం జరిగింది.  గిరిజనులు ఈ కార్యక్రమం ద్వారా ప్రశ్నించారనే ఆగ్రహంతో ప్రభుత్వ అధికారులు 16 మంది గిరిజనులపై మిలీషియా సభ్యులు, నక్సలైట్ తాలూకు వ్యక్తులు అని అక్రమ కేసులు పెట్టినారు. గిరిజనులపై ప్రభుత్వ అధికారులు కక్షసాధింపు చర్యలకు  నిరసనగా ఈ రోజు (ది.19.10.2018న) ఏజెన్సీ ముఖ ద్వారం మండల కేంద్రమైన ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్ లో సి.పి.ఐ(యమ్.యల్)లిబరేషన్, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం, అఖిలభారత వ్యవసాయ–గ్రామీణ కార్మిక సంఘం, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ గిరిజనులపై పెట్టిన తప్పుడు కేసులను, 140 సెక్షన్ ను తక్షణం ఎత్తి వేయాలని, మన్యంలో గిరిజనులపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ "రాస్తారోఖో" నిర్వహించడం జరిగింది.
   ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కె.గణేశ్వరరావు, యమ్.ధనబాబు, నాగమణి, కుశల, అర్జునుడు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment