ఎడిటోరియల్

Monday, October 8, 2018

పేదల భూములకు ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన "4th నోటిఫికేషన్"ను రద్దు చేయాలని విజయవాడలో ఫారెస్ట్ సెటిల్ కార్యాలయం వద్ద ధర్నా.


ది.8.10.2018న కృష్ణాజిల్లా, విజయవాడలో వున్న ఫారెస్ట్ సెటిల్ మెంట్ కార్యాలయం వద్ద సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్, అఖిలభారత వ్యవసాయ – గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ జిల్లా కార్యదర్శి డి. హారనాధ్ మాట్లాడుతూ ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో వున్న సర్వే నంబర్ 1/1, 4/33, 229/3 లలో వున్న సుమారు 1000 ఎకరాలు ప్రభుత్వ భూములను స్థానిక పేదలు గత 80 సంవత్సరాలుగా (మూడు తరాలకు పైగా) మామిడి, జామి, నిమ్మ ఇతర వ్యవసాయ పంటలు పండిస్తూ దానిపైన వచ్చే ఆదాయంతో తమ కుటుంబాలను పోషించుకొంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. తమ పూర్వీకుల నుండి ఆధారపడి జీవిస్తున్న భూములకు వారికి ఏ విధమైన సమాచారం లేకుండా ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన "4th నోటిఫికేషన్"ను రద్దు చేయాలని, అనేక సంవత్సరాల నుండి సాగు చేస్తున్న సాగుదారులందరికి ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పై డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు ఇవ్వడం జరిగింది.
   ఈ కార్యక్రమంలో అయర్లా జిల్లా కార్యదర్శి  D.పుల్లారావు, AICCTUనాయకులు M.ఈశ్వర్, AIKM నాయకులు V.బక్కయ్య, AIPWA నాయకులు P.కళావతి, M.వీరబాబు, కొండలరావు, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment