ఎడిటోరియల్

Wednesday, November 14, 2018

సి.బి.ఐ, ఆర్.బి.ఐ, సుప్రీంకోర్టు - రాజ్యాంగ సంస్థలు, పాలన యంత్రాంగంపై పెచ్చుమీరుతున్న మోడి ప్రభుత్వపు దాడి.

ఎం.ఎల్ అప్డేట్ అక్టోబర్ 30 సంపాదకీయం.
సి.బి., ఆర్.బి., సుప్రీంకోర్టు - రాజ్యాంగ సంస్థలు, పాలన యంత్రాంగంపై పెచ్చుమీరుతున్న మోడి ప్రభుత్వపు దాడి.

     2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది, పాలనా యంత్రాంగాలపై మోఢి ప్రభుత్వపు దాడి నానాటికి తీవ్రతరం చేస్తుంది. రాజ్యాంగ బద్ద సంస్థలను నిర్వీర్యం చేసి, భా..పా - ఆర్.ఎస్.ఎస్ మనువాద అజెండాకు మడుగులు వత్తే విధంగా అధికార యంత్రాంగాన్ని ప్రభావితం చేసే ప్రయత్నాలు ఇప్పటి వరకు తెరవెనుక సాగాయి. కాని ఇప్పుడు ఏకంగా బహిరంగ బెదిరింపులకు దిగుతూ, మాట వినని ఆయా సంస్థల ఉన్నతాదికారులతో డి అంటే డి అనే స్థాయికి భా..పా ప్రభుత్వం తెగబడుతుంది. తన జవాబుదారి తనానికి ప్రశ్న ఎదురయ్యే సరికి భా..పా ప్రభుత్వం ప్రశ్న లేవనెత్తే ప్రతి సంస్థ అధికారాన్ని నిర్వీర్యం చేసేందుకు బెదిరించి మెడలు వంచే పనికి పూనుకుంటుంది. వేడి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లతో పాటు సుప్రీం కోర్టుకు కూడా తగిలింది.
        గత యు.పి. ప్రభుత్వ హయాంలో సి.బి. డిపార్టిమెంటు ని "పంజరంలో బంధించబడిన చిలుక" అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం మన అందరికి గుర్తుండే ఉంటుంది. భాజపా ప్రభుత్వం వచ్చాక పంజరంలోని చిలుకను స్వేచ్చగా వదిలేసే మాట అటుంచి, పంజరాన్ని మరింత ఇరుకుగా చేసే పనులే చేస్తుంది. తగిన సమయంలో సి.బి. ని ఉసికొల్పి వివిధ రాష్ట్రాలలో పాలక-ప్రతిపక్షాలను దారిలో తెచ్చుకునేందుకు, తమతో పొత్తు కుదుర్చుకునేలా చేసేందుకే మాత్రమే సి.బి. ని ప్రయోగిస్తుంది. ప్రక్రియలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎంఫోర్స్మెంట్ డైరెక్టరెట్ లు పాలక ఎన్.డి. ప్రభుత్వ భాగస్వాములుగా తయరయ్యాయి.
           అభ్యంతరాలన్నిటిని పెడచెవిన పెడుతూ, గుజరాత్ నరమేధపు రోజుల నుంచి తనకు అత్యంత నమ్మకస్తుడిగా వ్యవహరిస్తున్న రాకేష్ ఆస్థానా ని సి.బి. ప్రత్యేక డైరెక్టరుగా మోడి నియమించుకున్నాడు. అంతేకాక, అవినీతి కేసులలో అధికారిని విచారించాలాన్నా సి.బి. లేదా మరే ఇతర దర్యాప్తు సంస్థైనా ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా పొందాలన్న నియమాన్ని చేరుస్తూ అవినీతి నిరోధక ఛట్టంలో మార్పులు తెచ్చారు. కాని రఫెల్ ఒప్పందం గురించి భయటపడ్డ విషయాలతో ఖంగుతిన్న మోడి సి.బి. విషయంలో సైతం జాగ్రత్త వహించాలన్న స్పృహలోకి వచ్చాడు. దాని ఫలితంగానే, సి.బి. మొత్తాన్ని మోడి-షా కబంధ హస్తాలలోకి తీసుకోవాలన్న స్వయంగా ప్రభుత్వం చేస్తున్న కుట్రను మనం చూస్తున్నాం.
                 మారిన అవినీతి ఛట్ట నియమం ప్రకారం, ప్రధాని స్వయంగా సభ్యుడైన కొలీజియం ద్వారా నియమితుడై 2019 జనవరి వరకు ఉధ్యోగంలో ఉండవల్సిన సి.బి. డైరెక్టర్ ఆలోక్ వర్మ స్వయంగా రాకేష్ ఆస్థానా అవినీతిపై దర్యప్తు చేపట్టడానికి అనుమతి కోరగా, ప్రభుత్వం సి.బి. డైరెక్టర్ ఆలోక్ వర్మనే తొలగించి స్థానంలో అవినీతికి మారుపేరుగా ఖ్యాతి గడించిన ఎం.నాగేశ్వరరావుని తాత్కాలిక డైరక్టర్ గా నియమించడం జరిగింది. అంతే కాక ఆలోక్ వర్మ కధలికలను కట్టడి చేసేందుకు తన అధికారిక నివాసం చుట్టూ నిఘా వర్గాలను నియమించటం జరిగింది. రాకేష్ అస్థానా తన చరిత్ర ఘనత ఏపాటిదో, గుజరాత్ లో పనిచేస్తుండగా గొధ్రా అల్లర్ల కేసులో మోడి పక్షం వహించడం ద్వారా, భారీ స్థాయిలో సొమ్ములను పోలీస్ సంక్షేమ నిధి నుండి భా..పా ఎన్నికల నిధిలోకి మరల్చడం ద్వారా నిరూపించుకున్నాడు. అలాగే నాగేశ్వరరావు కూడా ఒరిస్సా లోని ఫైర్ బ్రిగేడ్ యూనిఫార్మ్ స్కాం లాంటి అవినీతి కేసుల ద్వారా, సంఘ్ పరివార్ అరాచక చర్యలకు అనేక సార్లు తన వ్యాఖ్యానాల ద్వారా మద్ధతు తెలుపుతూ తన అర్హతను నిరూపించుకున్నాడు. ఒకపక్క ఇటువంటి నమ్మకస్తులైన తాబేదారులతో మోఢి ప్రభుత్వం సి.బి., సి.వి.సి లాంటి సంస్థలను నింపుతూ మరోపక్క కీలకమైన కేసులలో దర్యాప్తు చేపడుతున్న అధికారులపై తొలగింపులు, స్థానచలన ఉత్తర్వులు జారీ చేస్తూ వారిని వేధింపులకు గురిచేస్తుంది. సి.బి. కార్యాలయంలో కీలకమైన దస్తావేజులను మాయం చేయడానికి ఇంటెలిజన్స్ అధికారుల పేరుతో గుర్తుతెలియని వ్యక్తులను పంపే స్థాయికి తెగించింది.
             సి.బి. వ్యవహారంలో ప్రభుత్వం అనుసరించిన తీరు ఆర్ధిక, ప్రభుత్వ పాలన, న్యాయ శాఖల సహా దేశంలోని ఇతర ప్రధానమైన సంస్థలతో అది అనుసరించబోయే తీరుకు సంకేతంగా మనం అర్ధం చేసుకోవచ్చు. క్రిందటి ఆర్.బి. గవర్నర్ అయిన రఘురాం రంజన్ ను రెండవ సారి కొనసాగించేందుకు నిరాకరించటం, అత్యంత దారుణమైన-విచిత్రమైన నిర్ణయమైన మోఢి ప్రభుత్వపు నోట్ల రద్దు చర్యను సమర్దించవల్సిందిగా ఆర్.బి. ని బలవంత పెట్టడం లాంటి చర్యలతో మోఢి ప్రభుత్వం బ్యాంకింగ్ రంగ స్వయం ప్రతిపత్తికి, స్వతంత్ర నియంత్రణాధికారానికి కోత విధంచడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. కార్పొరేట్ ఎగవేతదారులపై మరింత ఖఠినమైన నియమాలను రూపొందించుకోవాలని, తన స్వంత నగదు నిల్వలను కాపాడుకోవాలని, ఆర్.బి. తో లావాదేవీలు జరిపే భాగస్వాములందరిపై నియంత్రణాధికారం తనకే ఉండాలన్న ఆర్.బి. నిర్ణయాలపై ప్రభుత్వం నుంచి, ఆర్.ఎస్.ఎస్ మద్ధతుదారులైన ఆర్ధిక నిపుణుల నుంచి అవిరామంగా దాడి తీవ్రమవుతూ వస్తుంది. తదనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ల బోర్డులో ఆర్.ఎస్.ఎస్ ఆర్ధిక నిపుణులు నియమింపబడటం కూడా జరిగింది.
                  బహుశా వీటన్నిటిని మించిన బహిరంగ ఘర్షణ ఏదో ప్రభుత్వానికి, సుప్రీం కోర్టుకి మధ్య జరగబోతున్నట్లు sకనబడుతుంది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును మొదట ఆహ్వానించి తరువాత పూర్తిగా మాటమార్చింది. అమలుచేయగల విధంగా మాత్రమే తీర్పులు వెలువరించాలని ఏకంగా సుప్రీంకోర్టుకే అమిత్ షా సలహాలివ్వడం మనం గమనించాం. అక్కడితో ఆగక, సుప్రీంకోర్టు తీర్పును అమలుచేసేందుకు ప్రయత్నించిన కేరళా ఎల్.డి.ఎఫ్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో పెకలించాలని పార్టి కేడర్ కు పిలుపునివ్వడం జరిగింది.అయోధ్య స్థలం ఎవరికి చెందుతుందన్న విషయంపై సుప్రీంకోర్టు జనవరిలో తీర్పు చెప్పనున్న నేపధ్యంలో, భా..పా మంత్రులు "హిందువుల సహనాన్ని పరీక్షించొద్దు" అంటూ బాహాటంగా బెదిరింపు-రెచ్చగొట్టే తరహా ప్రకటనలు చేస్తున్నారు. హిందుత్వ ఉన్మాద మూకలైతే సామాజిక మాధ్యమాలలో మరింత బరితెగించి కూల్చబడ్డ బాబ్రి మసీదు గోపుర స్థానంలో సుప్రీంకోర్టు గోపురపు చిత్రాలు పెట్టి స్పష్టమైన బెదిరింపు సంకేతాలు పంపుతున్నారు.
                   మోడి ప్రభుత్వం చేస్తున్న దాడులన్ని కేవలం ముస్లింలు, దళితులు, అర్బన్ నక్సల్స్ పైనే అనుకుంటే చాలా పొరపాటు చేసినట్లే. మనం ఒకసారి స్పృహలోకి వచ్చి పరిస్థితులను గమనించాలి. దాడులు కేవలం మైనార్టిలు, అణగారిన - బలహీన వర్గాలకే పరిమితం కాదు. ఇది ఏకంగా ప్రజాస్వామిక పరిపాలనా యంత్రాంగం పైనా, రాజ్యాంగ బద్ద సంస్థలపైన ఎక్కుపెట్టిన దాడి. ఏదైనా విపత్తు ఒక ప్రాంతాన్ని తాకితే, అది చుట్టుపక్కల ప్రాంతాలకి కూడా వినాశకారిగా మారుతుంది. ప్రస్తుతం మోడి ప్రభుత్వ చర్యలు సమగ్ర స్థాయిలో ఆర్ధిక-సామాజిక-రాజకీయ సంక్షోభానికి సంకేతంగా కనబడుతున్నాయి.ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొడి అనే పెను విపత్తునుంచి భారతదేశాన్ని మనమే రక్షించుకోవాలి.

Monday, November 12, 2018

రమణక్కపేట పేదలు సాగుచేస్తున్న అటవీ భూములకు పట్టాలివ్వాలి.


ది.12 నవంబర్ 2018న విజయవాడ  ఫారెస్ట్ సెటిల్ మెంట్ ఆఫీస్ వద్ద కృష్ణాజిల్లా ముసునూరు మండలం రమణక్కపేట అటవీ భూముల సాగుదార్లు సి.పి.ఐ(యమ్.యల్)లిబరేషన్ నాయకత్వంలో ధర్నా చేయడం జరిగింది.
    ముఖ్యంగా  4 వ నోటిఫికేషన్ రద్దు చేయ్యలి, 80సంవత్సరాలనుండి అటవీ భూములను సాగుచేస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఫారెస్ట్ అధికారి పద్మావతి గార్కి ఇవ్వటం జరిగింది.
  ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ డి. హరినాధ్, యమ్. ఈశ్వర్, బక్కయ్య, మారయ్య, AIPWA నాయకులు కామ్రేడ్ పి. కళావతి, సిపిఐ(యంమ్ యల్) లిబరేషన్ కార్యకర్తలు పాల్గొన్నారు.

12 నవంబర్ 2018న అన్నవరంలో సి.పి.ఐ(యమ్.యల్)లిబరేషన్ జన జాగరణ యాత్ర


      ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో (12 నవంబర్ 2018న) సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ "జన జాగరణ యత్ర"లో భాగంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అయార్లా సభ్యత్వం చేర్పించారు. ఈ నెల 19,20 తేదీలలో జహనబాద్,బీహార్ లో జరుగు అయార్లా 6వ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
    ఈ కార్యక్రమంలో అయార్లా జిల్లా కార్యదర్శి యమ్.లచ్చబాబు, టి. ఏసు, లక్ష్మి, భవానీ తదితరులు పాల్గొన్నారు.

తెనాలిలో అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పాండురంగ పేట పేదలు ఇళ్ల పట్టాలకై ధర్నా.


        ఈ రోజు ది.12 నవంబర్ 2018న గుంటూరుజిల్లా తెనాలిలో సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ ఆధ్వర్యంలో జరిగిన "జన జాగరణ యాత్ర"లో భాగంగా స్థానిక పాండురంగ పేటలో అనేక సంవత్సరాలనుండి ప్రభుత్వ భూములలో నివాసం ఉంటున్న పేదల ఇళ్ళకి  వెంటనే పట్టాలు ఇవ్వాలి అంటూ తెనాలి RDO ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించారు.
   ఈ కార్యక్రమంలో సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ నాయకులు కా.కళ్యాణ కృష్ణ , జిల్లా కార్యదర్శి యమ్.పి రామ్ దేవ్,జిల్లా కమిటీ సభ్యులు బడుగు రమేష్, లోకం భాస్కరరావు,టి. హనుమంతరావు, అర్.బెనెహార్, వెంకట సుబ్బారావు, బాలునాయక్,జీతానాయక్,కా.ఎల్లమ్మ, బుజ్జి,లక్ష్మీ, అనేకమంది మహిళలు,కాలనీ నివాసులు, పార్టీ సభ్యులు పాల్గొన్నారు.

Sunday, November 11, 2018

విద్యార్ధి – యువకులు ఐక్యంగా మోడీ–బాబులను గద్దెదించాలి. .....ఐసా




     
           మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ది.9 నవంబర్ 2018న కడపలో ఐసా(AISA) ఆధ్వర్యంలో ఐసా జిల్లా కార్యదర్శి డి.యమ్.ఓబులేష్ అధ్యక్షతన సదస్సు జరిగింది.
            ఈ కార్యక్రమములో ఐసా(aisa) జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సందీప్ సౌరవ్, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (డిల్లీ)(JNU) అధ్యక్షుడు  సాయి బాలాజీ,  సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ కేంద్ర కమిటీ సభ్యులు కా.. యన్. మూర్తి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
       
      ఈ సదస్సును ఉద్దేశించి వారు మాట్లాడుతూ మోడీ–బాబులు ఇచ్చిన ఎన్నికల హామీలను ఈ నాలుగున్నరేళ్ల పాలనలో విస్మరించారని దుయ్యబట్టారు. మోడీ యువతకు 2 కోట్లు ఉద్యోగాలు ఏవీ? అని ప్రశ్నించారు. మోడీ–బాబులు మీ గారడీ లెక్కలు మాని మీ పాలనలో మీరు చేసిన అసలు లెక్కలను ప్రజలకు వివరించండని డిమాండ్ చేశారు. ప్రజావ్యతిరేక, విద్యార్థి, యువత వ్యతిరేక విధానాలను అవలంభించిన మోడీ–బాబులను విద్యార్థి–యువకులు ఐక్యంగా గద్దెదించాలని  పిలుపునిచ్చారు.
   
 ఈ కార్యక్రమంలో  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)  కార్యదర్శి బాబులాల్, కడప జిల్లా cpi(ml) లిబరేషన్ నాయకులు రమణయ్య, కర్నూల్ జిల్లా ఐసా అధ్యక్షుడు యస్.నాగార్జున, కర్నూలు నగర కార్యదర్శి సురేంద్ర,తదితరులు పాల్గొన్నారు.

Tuesday, November 6, 2018

ఆర్.ఎస్.ఎస్ - బి.జె.పి ల విచ్చిన్నకర - దాటవేత ఎత్తుగడలను తిప్పికొట్టండి!

యమ్.యల్ అప్డేట్ అక్టోబర్ 23 సంపాదకీయం.


ఆర్.ఎస్.ఎస్ - బి.జె.పి ల విచ్చిన్నకర - దాటవేత ఎత్తుగడలను తిప్పికొట్టండి!

       సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఆర్.ఎస్.ఎస్ – బి.జె.పి ల ఎత్తుగడలు రోజులు గడుస్తున్న కొద్ది స్పష్టంగా మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఈ ఎత్తుగడలు ప్రధానంగా ఈ మధ్య జరిగిన నాలుగు సంఘటనల ద్వారా మనం అర్ధం చేసుకోవచ్చు. ఒకటి, డిసెంబర్ 6,1992 వరకు బాబ్రి మసీదు ఉన్న ప్రదేశంలోనే రామమందిర నిర్మాణం కోసం చట్టం చేయాలని మోడి ప్రభుత్వంపై ఆర్.ఎస్.ఎస్ ఒత్తిడి తీసుకురావడం. రెండు, 10 సం'ల నుండి 50 సం'ల వరకు వయస్సుగల స్త్రీలందరికి ప్రసిద్ధ శబరిమల ఆలయంలో ప్రవేశం కల్పించాలని, అందుకు నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన సంధర్భంలో భా.జ.పా ఆ తీర్పును అమలు పరచవల్సింది పోయి,దానిని అమలు చేసేందుకు ప్రయత్నించిన కేరళ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ హింసాత్మక క్యాంపెయిన్ ను చేపట్టడం. మూడు,ఉత్తరప్రదేశ్ త్రివేణి సంఘమంలో కుంభమేళా ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో అల్లహాబాద్ నగరం, జిల్లాలకు "ప్రయాగరాజ్" గా పేరుమారుస్తూ తుగ్లఖ్ తరహాలో యోగి ఆదిత్యనాధ్ ఉత్తర్వులు జారిచేయటం. నాలుగు, నేతాజి సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ప్రకటించిన చారిత్రక సంఘటన జరిగి 75 సం'లు కావస్తున్న తరుణంలో ఆ సంధర్బాన్ని పురస్కరించుకుని, సుభాష్ చంద్రబోస్ చారిత్రక వారసత్వాన్ని తమకు ఆపాదించుకునే కుటిల ప్రయత్నాన్ని మోడి చేయటం. ఇవన్ని కూడా చరిత్రను-ఇతిహాసాన్ని కలగాపులగం చేసి సంఘి-భాజపా ల కాషాయ-ఫాసిస్స్టు అజెండాకు అనుగుణంగా భారతదేశాన్ని తీర్చి దిద్దే ప్రయత్నానికి చట్టబద్దత తీసుకువచ్చే ప్రయత్నాలే.

         సంఘి మూకలు చేసే రామమందిర ప్రచారం సహజంగా రాముడికి అద్భుతమైన మందిరం నిర్మించడం పై కాకుండా బాబ్రి మసీదు కూల్చిన స్థలంలో కట్టడంపైనే కేంద్రీకృతమై ఉంటుంది. ఈ రకమైన పంతం వారు సహజంగా చెప్పే 16 వ శతాబ్దపు సంఘటనలకు ప్రతీకారంగా కాక, నేటి రాజకీయ పరిస్థితులలో  సుప్రీంకోర్టును-పార్లమెంట్ లాంటి రాజ్యాంగబద్ద సంస్థల ప్రాముఖ్యతను తగ్గించే కుటిల యత్నం. 1992 లో జరిగిన బాబ్రి మసీదు కూల్చివేత లాంటి చర్యలు సుప్రీంకోర్టు-పార్లమెంటు లను బేఖాతరు చేయడమైతే, 2018 లో వారి చర్యలు ఏకంగా వాటికి షరతులు నిర్దేశించే స్థాయికి చేరాయి. రామమందిర నిర్మాణానికి ప్రభుత్వం చట్టం చేయాలని ఆర్.ఎస్.ఎస్ కోరుకుంటుంది, అందుకు సుప్రీంకోర్టే చొరవచేసి దానికి అనుగుణంగా ప్రభుత్వానికి సూచనలు చేసినా సరే, లేదా సుప్రీంకోర్టును తోసిపుచ్చి పార్లమెంటులో తన మెజారిటి ఉపయోగించి ప్రభుత్వమే చట్టం చేసినా పర్వాలేదు. ఇవంతా భారతదేశాన్ని హిందు రాష్ట్రంగా మార్చాలన్న సంఘి ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంటు, సుప్రీంకోర్టు, రాజ్యాంగాలకు షరతులు నిర్దేశించే చర్యలే.


      రామమందిర విషయంలో ఏ విధంగా వ్యవహరించిందో, మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో కూడా అదే విధంగా వ్యవహరించింది. ఆర్.ఎస్.ఎస్ నాయకుడు మోహన్ భగవత్ మాట్లాడుతూ "సుప్రీంకోర్టు స్వేచ్చ-సమానత్వం అనే రాజ్యాంగ బద్ద వైఖరితో కాక మతపరమైన సెంటిమెంట్లను దృష్టిలో పెట్టుకుని తీర్పు ఇవ్వవల్సిందని" బాహాటంగా ప్రకటన చేయడం జరిగింది. ఇవే సంఘి మూకలు, ముస్లిం మహిళలకు న్యాయం పేరుతో, మూడుసార్లు తలాఖ్ చెప్పి తక్షణం విడాకులు తీసుకునే ఇస్లాం మతంలోని ఒక విధానాన్ని రద్దుచేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని పొగుడుతూ చూపిన అత్యుత్సాహం మనం మరచిపోలేదు. మూడు సార్లు తలాఖ్ విధానాన్ని క్రిమినల్ చర్యగా భావించి శిక్షార్హం చేస్తూ ఆర్డినెన్స్ తేవాలనే స్థాయికి ప్రచారాన్ని తీసుకువెళ్ళారు. ఈ నేపధ్యంలో, మహిళలకు ప్రవేశం విషయంలో శబరిమల ఆలయ బోర్డు - హజి ఆలి దర్గా ట్రస్ట్ బోర్దులు భిన్నంగా వ్యవహరించడం మనం గమనించాలి. హజి ఆలి దర్గా బోర్డు సుప్రీంకోర్టు తీర్పును శిరసావహిస్తే, ట్రావంకోర్ దేవస్థానం బోర్డు మాత్రం సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేయడమే కాక "సెక్స్ టూరిజానికి" ఈ తీర్పు మరింత ఊతం ఇస్తుందని వ్యాఖ్యానించింది. మరోపక్క కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే సుప్రీం తీర్పునుద్దేశించి "హిందు మత నమ్మకాలు-మనోభావాలతో ఆడుకునే విధంగా ఉందని" రెచ్చగొడుతూ భాద్యతారహిత వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ "మూడుసార్లు తలాఖ్" చెప్పే విధానానికి కాని, హజి ఆలి దర్గాలో మహిళల ప్రవేశాం విషయంలో కాని ముస్లింలు ఇదే వైఖరి అవలంబించి ఉంటే భా.జ.పా మరియు సంఘి మూకలు ఎంత రాద్ధాంతం చేసే వారో ఊహించటం పెద్ద కష్టమైన విషయం కాదు.

       ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాధ్ చట్టబద్ద పాలన గాలికొదిలి ఎన్ కౌంటర్ గిరి కొనసాగిస్తున్నాడు. అన్ని విధాల పాలన కుంటుబడి నియంతృత్వ పోకడ కొనసాగుతుంది. ప్రజాసంక్షేమం గాలికొదిలి పేర్లు మార్చే ప్రక్రియలో ఆదిత్యనాధ్ నిమగ్నమయ్యాడు. ముఘల్సరాయి పేరు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ మార్చిన తర్వాత ఇప్పుడు తాజాగా భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిన అల్లహాబాది నగరానికి జిల్లాకు "ప్రయాగరాజ్" మారుస్తూ ఉత్తర్వులు జారి చేసాడు. ఈ పేరు మార్చే ప్రక్రియను అల్లహాబాద్ హైకోర్టుకు-యూనివర్సిటీకి వర్తింపచేస్తే దాని పర్యవసానం కొన్ని వేల కోట్ల రూపాయల ఖరీదు చేస్తుంది. ఇది నోట్ల రద్దు స్థాయిలో వ్యర్ధ చర్యగా నిలిచిపోతుంది, దీనికి తోడు సాంస్కృతికంగా మూడత్వాన్ని, మూర్ఖత్వాన్ని తెలుపుతుంది. అల్లహాబాద్-ప్రయాగ లు కొన్ని శతాబ్దాలుగా జంటనగరాలుగా ప్రసిద్ధి చెందాయి. ముఘల్ నాటి నుంచి నేటి వరకు కొనసాగిన అల్లహాబాద్-ప్రయాగల ఘనమైన చరిత్ర సంస్కృతి, సమాజంలోని ప్రతి క్షేత్రంలో అవధుల్లేని విధ్వంసానికి పాల్పడేందుకు మాత్రమే అధికారాన్ని వెలగబెడుతున్న సంఘి మూకలకు చెంపపెట్టులాంటిది. ఈ పేర్లు మార్చే ప్రక్రియ "రామమందిర" ప్రచారానికి, వారణాసి లో జరగబోయే ఎన్.ఆర్.ఐ ల సమ్మేళనానికి, అల్లహాబాద్ లో జరగబోయే కుంభమేళాలకు ఊపు తెచ్చే సరికొత్త విధానంగానే మనం అర్ధం చేసుకోవాలి. తద్వారా కూడగట్టే భాజపా శ్రేణుల ఉత్సాహం, ఉన్మాదం రాబోయే 2019 ఎన్నికలకు ఇంధనంగా కూడా పనికొస్తుంది.

             ఒకపక్క ఈ రకమైన సాంస్కృతిక రాజకీయ పోరాటాలు జరుగుతుంటే, సింగపూర్ గడ్డపై నేతాజి సుభాష్ చంద్రబోస్ తాత్కాలిక ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ప్రకటించిన 75 సంవత్సరాల చారిత్రక సంఘటన స్మరణ పేరుతో, సుభాష్ చంద్రబోస్ వారసత్వాన్ని స్వంతం చేసుకునే కుటిల ప్రయత్నాన్ని మోది ప్రభుత్వం ప్రారంభించింది. "గత ప్రభుత్వాలన్ని, స్వాతంత్ర్య పోరాటంలో నేతాజి సుభాష్ చంద్రబోస్ పాత్రను, ఆయన త్యాగాన్ని విస్మరించాయని, నరేంద్ర మోడినే నేతాజి కి నిజమైన వారసుడని, చివరకు మోడి యే భారత స్వాతంత్ర్య పోరాట వీరుడైన  నేతాజికి తగిన గౌరవాన్ని ఇచ్చారు" అని భాజపా ప్రభుత్వం వ్యాఖ్యానించింది. గాంధి చిత్రాన్ని కేవలం వారి స్వచ్చభారత అభియాన్ క్యాంపెయిన్ కి ప్రచారకుడిగా ఉపయోగించుకున్నట్లే, సుభాష్ చంద్రబోస్ ను కూడా ఉపయోగించుకునే ప్రయత్నం తెరపైకొచ్చింది. అందుకోసం సుభాష్ చంద్రబోస్ వామపక్ష రాజకీయాలు, ఆర్ధిక ప్రణాళికల అవసరంపై ఆయన చూపిన ప్రాముఖ్యత, అభివృద్ధిలో అన్ని వర్గాల భాగస్వామ్య అవసరం, సావర్కర్ హిందు మహాసభ విచ్చిన్నకర రాజకీయాలను, మతోన్మాద మూడత్వాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించిన ఆయన వైఖరిని వదిలేసి నేతాజి అంటే కేవలం భారతదేశ స్వాతంత్ర్యం కోసం రెండవ స్త్వాతంత్ర్య పోరాటంలో జపాన్-జర్మనిలతో చేతులు కలిపిన ప్రభావవంతమైన నాయకుడిగా మాత్రమే చిత్రీకరించేందుకు మోడి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

             హిట్లర్, ముస్సొలిని, మొజొలతో చేతులు కలపాలన్న బోస్ రాజకీయ ఎత్తుగడలను కమ్యునిష్టులు అంగీకరించలేదు, ఆయనను తీవ్ర స్థాయిలో విమర్శించారు కూడా. కాని ఆజాద్ హింద్ ఫౌజ్(ఐ.ఎన్.ఎ) సైనికులను విడుదల చేయాలని జరిగిన దేశవ్యాప్త క్యాంపెయిన్ లో కాంగ్రెస్ తో పాటు కమ్యునిస్టులు ముందు వరుసలో ఉన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్, తాత్కాలిక ఆజాది హింద్ ప్రభుత్వాల కూర్పు భారతదేశ బిన్నత్వాన్ని, బహుళత్వాన్ని ప్రతిబింబించింది. ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులను విడుదల చేయాలని చేసిన పోరాటం భారత స్వాతంత్ర్య పోరాటపు అంతిమ ఘట్టంలో యుద్ధ కేకగా చరిత్రలో నిలిచింది. ఎంతో మంది ఐ.ఎన్.ఎ నాయకులు కమ్యునిస్టు ఉధ్యమంలో చేరారు. ఐ.ఎన్.ఎ స్థాపనకు ముందు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాజకీయ పార్టి స్వాతంత్ర్య పోరాటానంతరం వామపక్ష శిబిరంలో భాగస్వామిగా కొనసాగింది. ఆజాద్ హింద్ ఫౌజ్ లో అందరు స్త్రీలతో ఏర్పదిన ఝాన్సి రాణి రెజిమెంటుకు చీఫ్ గా ఉన్న కెప్టెన్ లక్ష్మి సెహగల్, తర్వాత భారత కమ్యునిష్ట్ పార్టి సీనియర్ మెంబర్ గా ఉండి, తర్వాతి కాలంలో మొదటి ఎన్.డి.ఎ హయాంలో భారత రాష్ట్రపతి పదవికి ప్రతిపక్ష అభ్యర్దిగా నిలిచారు. ఒకపక్క సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్యం కోసం పోరాడుతుంటే, ఆర్.ఎస్.ఎస్ - హిందు మహా సభలు బ్రిటిష్ వారితో అంటకాగుతున్నారు. సావర్కర్ అయితే హిందు సైన్యాన్ని ఏకీకృతం చేసేందుకు, హిందు జాతీయతను పెంపొందించేందుకు ఏకంగా "బ్రిటిష్ సైన్యాన్ని హిందువులతో నింపండి" అని హిందువులందరికి పిలుపునిచ్చాడు. దీనికి హిందుత్వ అని పేరు కూడా ఇచ్చాడు. సుభాష్ చంద్రబోస్ త్యాగాన్ని-ఆయన పాత్రను విస్మరించారని ఇతరులను విమర్శించే ముందు, మోడి-ఆర్.ఎస్.ఎస్-భా.జ.పా లు భారత స్వాతంత్ర్య పోరాటానికి వారు చేసిన ద్రోహాన్ని, బ్రిటిష్ పాలకులతో అంటకాగిన వారి స్వంత చరిత్ర గురించి ప్రజలకు సమాధానం చెప్పాలి.

           ఆకాశాన్నంటుతున్న ధరలు, తీవ్ర స్థాయిలో నిరుద్యోగం, నానాటికి తీవ్రమవుతున్న ఆర్ధిక-రైతాంగ సంక్షోభాలు, మోడి ప్రభుత్వం పోషిస్తున్న ఆశ్రిత పెట్టుబదిదారి విధానంలో పెచ్చుమీరుతున్న అవినీతిల వల్ల భారత ప్రజలు నలిగిపోతుంటే, స్వయానా ప్రధానిచే నియమితుడైన సి.బి.ఐ ఉన్నతాధికారి లంచగొండి కేసును ఎదుర్కొంటుంటే, మోడికి - తన వానర సైన్యానికి నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రతి రంగంలో వారు తలపెట్టిన వినాశనానికి సమాధానం కరువైంది. కాబట్టి, ప్రజలను విడగొట్టి - వారి దృష్టి మరల్చడానికి అనేక దారులు వెతుకుతున్నారు. ఈ సంక్షోభాన్ని సమర్దవంతంగా ఎదుర్కోవాలంటే, మనందరం  బలమైన ఐక్యతను ప్రదర్శించాలి. సంఘి - భా.జ.పా ప్రణాళిక లోని "విభజించు - దృష్టి మరల్చు" ఎత్తుగడలను బట్టబయలు చేయాలి. ఈ దేశానికి తేరుకోలేని ప్రమాదం తలపెట్టగల సమర్దులుగా రుజువైన ప్రస్తుత పాలకులను, 1977 లో ఎమర్జెన్సీ హయాంను తిప్పికొట్టిన స్థాయిలో ఎన్నికల బరిలో ఓడించి ఇంటికి పంపవల్సిన అవసరం నెలకొంది.